గుడివాడ క్యాసినో వ్యవహారం చినికి చినికి గాలివాన మారింది. మంత్రి కొడాలి నాని కే కన్వెన్షన్ లోనే క్యాసినో నిర్వహించారంటూ టీడీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ అంశంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ వ్యవహారంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. తన కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించినట్లు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ సవాలు విసిరారు.
‘నేను ఛాలెంజ్ చేస్తున్నా.. మా కల్యాణ మండపం రెండున్నర ఎకరాల్లో ఉంటుంది. నా కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించారని నిరూపిస్తే.. రాజకీయాలను వదిలేయడమే కాదు.. పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను. అవన్నీ పుకార్లని తేలితే టీడీపీ వాళ్లు ఏం చేస్తారు? సంక్రాంతికి అన్ని ప్రాంతాల్లో జరిగినట్లుగానే కోడి పందేలు, జూదం గుడివాడలో కూడా జరిగాయి. మహిళలతో నృత్యాలు చేయిస్తున్నట్లు మీడియాలో చూసి నేనే డీఎస్పీకి ఫోన్ చేసి చర్యలు తీసుకోమన్నాను. మొదలైన ఐదారు గంటల్లో కార్యక్రమాలను ఆపించాము.
పిచ్చి ఆరోపణలు, పిచ్చి విమర్శలను పట్టించుకోవద్దు. న్యూట్రల్ గా వ్యవహరించే మీడియా వాళ్లు కే కన్వెన్షన్ కి వెళ్లండి. అక్కడ క్యాసినో జరిగిందేమో మీరు కనుక్కోండి. నిజమని నిరూపిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను పెట్రోలు పోసుకుని’ అంటూ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. మంత్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.