ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇవాళ ఉదయం మృతి చెందారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 49 సంవత్సరాలు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి రెండ్రోజుల క్రితమే దుబాయ్‌లో జరిగిన ఇండియన్ ఎక్స్ పోకి వెళ్లారు. ఏపీ తరఫున పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి తెలిపారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఆయన చివరిసారిగా దుబాయ్‌లోని ఖలీజ్ టైమ్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏపీలో పరిశ్రమలు స్థాపితే.. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మద్దతిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమం ముగించుకొని.. ఫిబ్రవరి 20, ఆదివారం ఇండియాకు తిరిగి వచ్చారు. ఇవాళ ఉదయం ఆయన అస్వస్థతకు గురయ్యారు.. వెంటనే హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. గుండె పోటుతో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. గౌతమ్ రెడ్డి దుబాయ్‌లో జరిగిన ఇండియన్ ఎక్స్ పో ప్రసంగించిన చివరి మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Last visuals of late @MekapatiGoutham Reddy in #DubaiExpo2022 #Dubai pic.twitter.com/CoFhh0k3IH
— Sudhakar Udumula (@sudhakarudumula) February 21, 2022