సాధారణంగా మనం ఏదైనా కొని.. డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతే… మరోసారి ఆ షాపుకి, లేదా ఆ ప్రాంతానికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడతాం. మనసులో ఏదో ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇలాంటి సంఘటనల గురించి గొప్పగా చెప్పుకునే వారు సైతం ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయేది ఇందుకు పూర్తిగా భిన్నమైన కథనం. సుమారు 12 ఏళ్ల క్రితం ఓ చిరు వ్యాపారి దగ్గర వేరు శనక్కాయలు కొనుక్కుని.. డబ్బులు ఇవ్వడం మర్చిపోయిన బాలుడు.. ఆ విషయాన్ని ఇప్పటికి గుర్తు పెట్టుకుని.. ఆ వ్యాపారి వివరాలు తెలుసుకుని.. అతడి కుటుంబ సభ్యులకు 25 వేల రూపాయలు అందించి గొప్ప మనసు చాటుకున్నాడు. ఆ వివరాలు..
కాకినాడకు చెందిన మోహన్ నేమాని కుటంబం అమెరికాలో స్థిరపడింది. అప్పడప్పుడు భారత్ వస్తుండేవారు. ఈ క్రమంలో 2010లో కాకినాడ వచ్చారు. ఆ సమయంలో మోహన్ తన కుమారుడు ప్రణవ్, కుమార్తెను తీసకుని బీచ్ కి వెళ్లాడు. అక్కడ వేరు శనక్కాయలు అమ్ముకుంటున్న పెద సత్తయ్య దగ్గర శనక్కాయలు కొన్నారు.. కానీ పర్స్ మర్చిపోవడంతో డబ్బులు ఇవ్వలేకపోయారు. ఆ సమయంలో ప్రణవ్, పెద సత్తయ్యతో ఫోటో దిగాడు.
ఆ తర్వాత ప్రణవ్ ఎప్పుడు కాకినాడ వచ్చిన పెద సత్తయ్య కోసం వెతికేవాడు. కానీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఈ ఏడాది మోహన్ తన స్నేహితుడైన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరెడ్డికి ఈ విషయం గురించి తెలిపారు. ఎమ్మెల్యే తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రణవ్, పెద సత్తయ్య తీసుకున్న ఫోటోని పోస్ట్ చేశారు.
పెద సత్తయ్యకు సంబంధించిన వారుంటే సంప్రదించాలని.. తన పీఏ ఫోన్ నంబరు ఇచ్చారు. చివరకి అతని కుంటుంబం జిల్లాలోని యూ.కొత్తపల్లి మండలం నాగులాపల్లిలో ఉంటున్నట్లు గుర్తించారు. పెద సత్తయ్య మరణించగా.. ఆయన కుటుంబ సభ్యులను గురువారం కాకినాడ ఎమ్మెల్యే ఇంటికి పిలిపించి.. ఎన్ ఆర్ ఐ మోహన్, ఆయన పిల్లలు వారికి 25 వేల రూపాలయ ఆర్థిక సాయం అందజేశారు. ఎన్ ఆర్ ఐ కుటుంబం చేసిన పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.