సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గొప్పగా చేస్తుంటారు. ముఖ్యంగా ఏపిలో సంక్రాంతి పండుగకు దూర ప్రాంతాల్లో ఉన్నవారు తమ స్వంత ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతుంటారు. ఇక ప్రయాణీకులకు ఏపి సర్కార్ షాక్ ఇచ్చింది. సంక్రాంతి సీజన్ లో ఆర్టీసీ బస్సు టికెట్ల రేట్లు 50 శాతం పెంచింది. అసలే కరోనా కష్టకాలం అంటుంటే ఇప్పుడు సర్కారు తీసుకున్న నిర్ణయింతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
సంక్రాంతి సీజన్ లో ఆర్టీసీ బస్సు టికెట్ల రేట్లు పెంచడంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు వలసకు వెళ్లిన ప్రజలు పండుగలకు తమ గ్రామాలకు వస్తుంటారని… అలాంటి సమయంలో బస్సు టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం 50 శాతం పెంచిందని ఆయన విమర్శించారు.
ఇది చదవండి : మీ ఇద్దరిని అలా చూసి నేను కుళ్లుకుంటున్నాను
‘పేద ప్రజలపై ప్రేమ ఉండటం అంటే ఆర్టీసీ సంక్రాంతి బస్సుల్లో ఛార్జీలు 50 శాతం పెంచడమా వైఎస్ జగన్ గారూ? సంతోషంగా పండగకి ఊరు వచ్చే మన జనం జేబులు గుల్ల చేయడమేమిటి? తమ రాష్ట్ర సంక్రాంతి బస్సుల్లో బాదుడు లేదు అని తెలంగాణ ఆర్టీసీ ప్రచారం చేస్తోంది. అంటే మీ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది’ అంటూ నాదెండ్ల ట్విట్ చేశారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
పేద ప్రజలపై ప్రేమ ఉండటం అంటే ఆర్టీసీ సంక్రాంతి బస్సుల్లో ఛార్జీలు 50 % పెంచడమా @ysjaganగారూ? సంతోషంగా పండగకి ఊరు వచ్చే మన జనం జేబులు గుల్ల చేయడమేమిటి? తమ రాష్ట్ర సంక్రాంతి బస్సుల్లో బాదుడు లేదు అని తెలంగాణ ఆర్టీసీ ప్రచారం చేస్తోంది అంటే మీ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. 🙏🏻 pic.twitter.com/RS2hz4zAYG
— Manohar Nadendla (@mnadendla) January 5, 2022