ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఏ రేంజ్ లో ఉందో ‘చలో విజయవాడ’తో అర్థం అయ్యింది. ఈ కార్యక్రమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసింది. వారం రోజలు ముందు నుంచే కార్యక్రమాన్ని ఎలా అడ్డుకోవాలి అనే దాని మీద వ్యూహాలు రచిస్తూ వచ్చింది. అనుమతి నిరాకరణ మొదలు ముందస్తు అరెస్టుల వరకు ఎన్ని విధాలుగా ఉద్యోగులను అడ్డుకోవచ్చో అన్ని రకాలుగా ప్రయత్నించింది. అయినా సరే ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయ్యిందనే చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి : ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకున్నారు. అయితే ఉద్యోగుల నిరసన కార్యక్రమం ఇంత భారీ ఎత్తున విజయవంతం కావడంలో ఏపీ పోలీసులు ప్రధాన పాత్ర పోషించారనే వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఉద్యోగులకు మద్దతుగా నిలవడమే కాక.. చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల చలో విజయవాడ ఇంత భారీ విజయం సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
‘చలో విజయవాడ’ సక్సెస్ కావడంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి, సజ్జల వంటి నాయకులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పోలీసుల వైఖరి వల్లే, ఉద్యోగులు ఇంత పెద్ద ఎత్తున వచ్చారని, పోలీసులు ఎక్కడా నిలువరించే ప్రయత్నం చేయలేదని, చూసి చూడనట్టు వదిలేశారని, ప్రభుత్వ పెద్దలు ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రకటించిన పీఆర్సీ జీవోల వల్ల మిగతా ఉద్యోగులతో పాటు పోలీసుల జీతాలు కూడా తగ్గి పోయాయి. అయితే పోలీసులు బయటకు వచ్చి ఆందోళన చేసే అవకాశం లేదు. అందుకే ఉద్యోగుల ఉద్యమానికి కింద స్థాయి పోలీసులు మద్దతు తెలపబట్టే, చలో విజయవాడ ఇంత భారీ ఎత్తున విజయవంతం అయ్యిందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.
అదీ కాక పోలీసు శాఖపై సజ్జల పెత్తనం ఎక్కువ అనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. సజ్జల పైన పోలీసులకు ముందు నుంచి అసహనం ఉందని, దాన్ని ఇలా బయటప పెట్టి ఉంటారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు పోలీసులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం అయితే, రాజకీయంగా కూడా ఇబ్బంది అని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : ‘చలో విజయవాడ’ విజయవంతం.. సీఎం జగన్ అత్యవసర భేటీ