బోధనాసుపత్రుల్లో వైద్యులు దీర్ఘకాలిక సెలవులో వెళ్తే..విధుల నుంచి తొలగిస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ట బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ బుధవారం గుంటూరులోని సర్వజనాసుపత్రిని సందర్శించారు. అక్కడి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి.. పై వ్యాఖ్యలు చేశారు.
గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో జరిగిన సమావేశానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, డైరెక్టర్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ రాఘవేంద్ర తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రజనీ మాట్లాడుతూ.. నాడు–నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధి, కొత్త ఆస్పత్రుల నిర్మాణాల కోసం ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కళాశాలలను తీసుకొస్తున్నట్టు తెలిపారు.ఈ సందర్భంగా యూరాలజీ విభాగం అధిపతి ఆచార్య ప్రకాశరావు మాట్లాడుతూ తమ విభాగంలో ఉన్న ఇద్దరు సహాయ ఆచార్యులు ఇటీవల విశాఖపట్నం బదిలీ అయ్యారని, అక్కడి నుంచి వచ్చిన ఇద్దరు వైద్యులు విధులస్లో చచేరి .. వెంటనే సెలవులపై వెళ్లిపోయారని తెలిపారు. దీనివల్ల తాను ఒక్కడినే రోగులకు సేవలందించడం కష్టంగా మారిందని తెలిపారు. దీంతో బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు దీర్ఘకాలిక సెలవులో వెళ్తే.. విధుల నుంచి తతొలగిస్తామని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి కృష్ణ బాబు స్పష్టం చేశారు. మరి.. ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.