ఈరోజుల్లో టిఫిన్ చేయాలంటే.. కనీసం 30 నుంచి 50 రూపాయలు వెచ్చిచాల్సిందే. ఓ స్థాయి గుర్తింపు ఉన్న హోటల్ అయితే.. ఇది ఇంకాస్తా ఎక్కువే. కానీ ఏపీలో అక్కడికెళితే ఒక్క రూపాయికే.. మీ ఆకలి తీరుతుంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని ఆర్బీ కొత్తూరు గ్రామంలో ఓ చిరు హోటల్ యాజమాని అయిన చిన్ని రామకృష్ణ(రాంబాబు).. రూపాయికే.. వేడి వేడి ఇడ్లీని కస్టమర్లకు అందిస్తున్నాడు. గత 16 సంవత్సరాలుగా రాంబాబు ఆర్బీ కొత్తూరు గ్రామంలో ఈ జనతా హోటల్ నడుపుతున్నాడు. అందుకే తెల్లారగానే రాంబాబు హోటల్ ముందు కస్టమర్లు క్యూ కడుతుంటారు.
రాంబాబు హోటల్ లో ఇడ్లీ.. బొండా తిన్నారంటే చాలు.. తినేకొద్ది ఆకలి వేస్తూనే ఉంటుందట. టిఫిన్ కి ఇచ్చే పల్లీల చట్నీ చాలా రుచికరంగా ఉంటుందని చెబుతున్నారు కస్టమర్లు. ఐతే ఈ చట్నీని మాత్రం రాంబాబు సతీమణీ రాణి చేస్తారట. ఉదయాన్నే 3 గంటలకే నిద్రలేచి .. 5 గంటల కల్లా వేడి వేడిగా టిఫిన్ సిద్దం చేస్తారట. దీంతో వ్యవసాయ పనులకు వెళ్ళే కూలీలు రాంబాబు హోటల్ లో టిఫిన్ ఆరగించి పనులకు బయలు దేరతారు. మరి రాంబాబు హోటల్ గురుంచి పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.
ఇది కూడా చదవండి: ఆరేళ్ల పిల్లాడు చేసిన పనికి షాకైన పోలీసులు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.