ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో మానత్వం చాటుకుంటూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. గతంలో ఆయన తన కాన్వాయ్ లో వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఎవరికైనా ఇబ్బందిలో ఉంటే వెంటనే స్పందించి వారికి సహాయం చేస్తుంటారు. ఏపీ సీఎం జగన్ ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో కడప విమానాశ్రయం నుంచి ఒంటిమిట్టకు రోడ్డుమార్గంలో బయల్దేరారు.
కాన్వాయ్ వస్తున్న సమయంలోనే 108 అంబులెన్స్ రావడం గమనించిన సీఎం జగన్ వెంటనే అప్రమత్తమై అధికారులకు అంబులెన్స్ కి దారి ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. దీంతో కాన్వాన్ యి పక్కకు నిలిపి అంబులెన్స్ వెళ్లేందుకు దారి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఒంటిమిట్టకు చేరుకుని కోదండ రాముడి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం హూదాలో ఉండి కూడా మానవత్వం చాటుకున్న జగన్ పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.