Ceiling Fan: పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థినిపై సీలింగ్ ఫ్యాన్ ఊడి పడింది. దీంతో విద్యార్థిని కంటికి గాయమైంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన స్పందన అనే విద్యార్థిని లెక్కల పరీక్ష రాయటానికి విజ్ఞాన్ పాఠశాలకు వెళ్లింది. పరీక్ష హాలులో కూర్చుని పరీక్ష రాస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి సీలింగ్ ఫ్యాన్ ఊడి, స్పందనపై పడింది. దీంతో బాలిక కంటి కింది భాగంలో గాయమై రక్తస్రావమైంది. ఉపాధ్యాయులు వెంటనే బాలికనను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. విద్యార్థినికి ఎలాంటి అపాయం లేదని స్పష్టం చేశారు.
చికిత్స అనంతరం స్పందన తన పరీక్షను పూర్తి చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్ష షెడ్యూల్‌లో భాగంగా సోమవారం లెక్కల పరీక్ష జరిగింది. మరి, పరీక్ష హాలులో విద్యార్థినిపై సీలింగ్ ఫ్యాన్ ఊడి పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Anakapalle: ఇంటి పేరు పాము ప్రసాద్.. ఒంటి రంగు పాము చర్మం!