Balakrishna : ‘అఖండ’ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావటంతో మాంచి జోష్ మీద ఉన్నారు బాలయ్య బాబు. ఆర్ఆర్ఆర్ రీలీజ్‌కు ముందు వరకు అఖండ్ మానియా కనిపించింది. అఖండ సినిమాలో అఘోరాగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన బాలయ్య.. తాజగా రియల్ లైఫ్‌లో ముస్లిం వ్యక్తిలా డ్రెస్ వేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఓ పెళ్లికి హాజరైన ఆయన తన వేషధారణతో అక్కడ సందడి చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆయన స్వంత నియోజకవర్గం అయిన హిందూపురంలో ఓ మైనారిటీ నేత ఇంట్లో పెళ్లి జరిగింది.
ఆ పెళ్లికి బాలయ్య బాబు హాజరయ్యారు. అది కూడా ముస్లిం వ్యక్తి వేషధారణలో.. బాలయ్యను చూడటానికి జనం ఎగబడి వచ్చారు. ఆయన అభివాదాలతో.. అభిమానుల అరుపులతో ఆ ప్రాంతం సందడి సందడిగా మారింది. జనం సెల్ఫోన్లో ఆయన ఫొటోలు తీసుకుని మురిసిపోయారు. బాలయ్య వేషధారణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : హాస్పిటల్ లో డాక్టర్ బాబు భార్య.. ఎమోషనల్ వీడియో!