ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో మానత్వం చాటుకుంటూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ.. రోడ్డు పై ప్రమాదంలో ఉన్నవారిని తమ సొంత వాహనాల్లో తరలిస్తూ వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులతో మాట్లాడుతున్నారు. ఈ మద్య సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వం చాటుకుంటున్నారు. తమ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో అంబులెన్స్ రావడంతో తమ వాహనాలు ఆపి మరీ దారి ఇచ్చారు.
ఇటీవలే ఈ మద్య ఏపీ కేబినెట్ లో మార్పులు చేర్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. తాజాగా ఆయన ప్రమాదంలో ఉన్నవారిని రక్షించి మానవత్వం చాటుకున్నారు. అమర్నాథ్ తన కాన్వాయ్ లో అనకాపల్లి వెళ్తున్నారు. అదే సమయంలో బైక్ యాక్సిడెంట్ కి గురైన విషయం తెలుసుకొని తన కాన్వయ్ లో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.
బా ఆసుపత్రికి ఫోన్ చేసి బాధితులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులకు సూచించారు. తాజాగా మంత్రి అమర్ నాథ్ చేసిన పనికి అభిమానులు, కార్యకర్తలుఆయనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.