సమాజంలో నిత్యం ఎన్నో నేరాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆడవారికి రక్షణ లేకుండా పోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల.. తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు మనశ్శాంతి కరువవుతుంది. ఎవరిని నమ్మలేని పరిస్థితులు తలెత్తాయి. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఓ సంఘటన కలకలం రేపుతుంది. ఆటో ఎక్కిన యువతి.. గమ్యస్థానం చేరకుండానే అదృశ్యం అయ్యింది. దానికంటే ముందు సదరు యువతి తన స్నేహితురాలితో మాట్లాడిన మాటలు సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: మాస్టారుకు 9వ తరగతి విద్యార్థి లేఖ.. రోజు తాగొస్తున్నానంటూ!
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ప్రకారం ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హారిక అనే యువతి.. తన స్నేహితురాలిని కలవడం నిమిత్తమో.. లేదా వేరే పనిమీదనో ఓ ఆటో ఎక్కింది. అయితే ఆటో డ్రైవర్ ప్రవర్తన తేడాగా ఉండటంతో.. భయపడిన సదరు యువతి అతడి గురించి తన స్నేహితురాలికి మెసేజ్ చేసింది. ఆటో డ్రైవర్ కావాలనే నెమ్మదిగా వెళ్తున్నాడని చెప్పింది. తాను మధ్యాహ్నం 2.15 గంటల వరకు స్నేహితురాలిని కలుస్తానని చెప్పిన యువతి దగ్గర నుంచి ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేదు.
ఇది కూడా చదవండి: పాపం మూడు నెలలుగా నడి సంద్రంలో వానరం.. చివరికి..
స్నేహితురాలి కోసం ఎదురు చూసిన యువతి.. ఆమెకి కాల్ చేసింది, మెసేజ్ చేసింది. కానీ ఎలాంటి సమాధానం లేకపోవడంతో.. వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తనకు సాయం చేయాల్సిందిగా ఏపీ పోలీసు, తూర్పు గోదావరి పోలీసులను కోరింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరి యువతి ఎక్కడికి వెళ్లినట్లు.. ఆటో డ్రైవర్ ఆమెను ఎక్కడికైనా తీసుకెళ్లాడా.. ఏంటి అనే వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారానికి ఐదురోజులే పనిదినాలు..!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.