నేషనల్ డెస్క్- చాలా మందికి డ్యాన్స్ చేయాలని కోరిక ఉంటుంది. కానీ అంతా ఏమనుకుంటారోనని డ్యాన్స్ చేయడానికి వెనుకడుగువేస్తుంటారు. ఇక కొందరైతే ఇష్టమైన మ్యూజిక్ ఉంటే ఆటోమేటిక్ గా స్టెప్పులేస్తుంటారు. అదే స్టేజిపై ఎవరైనా బాగా డ్యాన్స్ చేస్తుంటే మరి కొంత మంది కాలు కదుపుతుంటారు. ఇదిగో హర్యానాలో ఓ ముసలోడు డ్యాన్స్ మామూలుగా చేయలేదు.
ఓ వృద్ధుడు తన వయసును మర్చిపోయి వేలాది మందిలో ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసి ఔరా అనిపించాడు. అది కూడా స్వప్నా చౌదరి ఎదురుగా నిల్చుని స్టెప్పులేశాడా ముసలోడు. అన్నట్లు మీకు స్వప్నా చౌదరి తెలుసు కదా.. హర్యానా రాణిగా ఆమె బాగా పాపులర్. ఎప్పుడూ డ్యాన్స్ వీడియోలతో అలరించే సప్నాకు మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.
సప్నా చౌదరికి చెందిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో వేలాది మంది ముందు స్టేజ్‌పై సప్నా హర్యాన్వి పాటకు డ్యాన్స్ చేసింది. చుట్టు ఉన్న జనాలు చప్పట్లతో ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతలో స్టేజ్ ముందు కూర్చున్న ఓ ముసలాయన లేచి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు.
సప్నా చౌదరికి ఎదురుగా నిలబడి దూరం నుంచి హుషారైన స్టెప్పులతో అదరగొట్టాడు. ఏ మాత్రం మోహమాటపడకుండా ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.