YS Jagan Mohan Reddy: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలియజేశారు. ఆదివారం ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 11, 2022 కృష్ణంరాజు మృతిపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా సంతాపం తెలియజేశారు. ఆయన స్పందిస్తూ.. ‘‘ ప్రముఖ నటులు, మాజీ కేంద్ర మంత్రి శ్రీ కృష్ణంరాజు గారి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. నటునిగా విభిన్న పాత్రలలో మెప్పించిన కృష్ణంరాజు గారు, రాజకీయాలలో కూడా నిజాయితీతో ప్రజలకు సేవలు అందించారు. ఆయన మృతి తెలుగు నేలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని అన్నారు. ప్రముఖ నటులు, మాజీ కేంద్ర మంత్రి శ్రీ కృష్ణంరాజు గారి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. నటునిగా విభిన్న పాత్రలలో మెప్పించిన కృష్ణంరాజు గారు, రాజకీయాలలో కూడా నిజాయితీతో ప్రజలకు సేవలు అందించారు. ఆయన మృతి తెలుగు నేలకు తీరని లోటు.(1/2) pic.twitter.com/e9nBVU3Zye — N Chandrababu Naidu (@ncbn) September 11, 2022 ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.(2/2) — N Chandrababu Naidu (@ncbn) September 11, 2022 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణంరాజు మృతిపై సంతాపం తెలియజేశారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, 'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం పేర్కొన్నారు. లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో మాజీ కేంద్రమంత్రి శ్రీ కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. — Telangana CMO (@TelanganaCMO) September 11, 2022 తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, 'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం పేర్కొన్నారు. — Telangana CMO (@TelanganaCMO) September 11, 2022 లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. — Telangana CMO (@TelanganaCMO) September 11, 2022