నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల వివాదం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్స్ ఛానల్ మూసేసి, మోకాళ్లపై కూర్చుని ఆడవాళ్లందరికి క్షమాపణ చెప్పేవరకు తాను వదలిపెట్టనని కళ్యాణి బహిరంగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తో పాటు మరికొంత మంది వల్గర్ వీడియోలు చేసే యూట్యూబర్స్ ఛానల్స్ మూసేయ్యాలని ఆమె డిమాండ్ చేస్తూ పోలీసుకు సైతం ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కరాటే కళ్యాణి నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ శ్రీకాంత్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. శుక్రవారం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అటెంప్ట్ టు మర్డర్, బ్లాక్ మేయిలింగ్ కేసు పెట్టాడు.
ఇక తాజాగా కరాటే కళ్యాణి – శ్రీకాంత్ రెడ్డిల వివాదంపై ఓ టీవీ ఛానల్ డిబేట్ ఏర్పాటు చేయగా.. ఆ డిబేట్ లో కరాటే కళ్యాణి, శ్రీకాంత్ రెడ్డిలతో పాటు సినీ నిర్మాత చిట్టిబాబు, ఇండస్ట్రీకి చెందిన తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డిపై సీరియస్ అయ్యింది. తర్వాత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. డిబేట్ లో పాల్గొన్న సినిమావాళ్ళను ‘బచ్చాగాళ్లు.. వాళ్ళకి సినిమా ఇండస్ట్రీకి సంబంధమే లేదు’ అంటూ నోరు పారేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వివాదం మరింత ముదిరే స్థితికి చేరుకుంది. ఈ డిబేట్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి సినిమావాళ్లపై శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.