Young Director: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు సలీం గౌస్ మరణించిన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. యంగ్ డైరెక్టర్ పైడి రమేష్ కరెంట్ షాక్‌తో కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రమేష్ యూసఫ్‌గూడలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం వాకింగ్ వెళ్లి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో వర్షం పడుతోంది. దీంతో బాల్కనీలో ఆరేసిన బట్టలు తీయటానికి వెళ్లారు. గాలికి కొన్ని బట్టలు కరెంట్ తీగపై పడటంతో రాడ్‌తో తీయటానికి ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో షాక్ కొట్టి నాలుగవ అంతస్తులో ఉన్న ఇంటి బాల్కనీలోంచి కిందకు పడిపోయారు. అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రమేష్ ‘రూల్’ అనే సినిమా తీశారు. ప్రస్తుతం మరో సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. రమేష్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఇవి కూడా చదవండి : Salim Ghouse: బ్రేకింగ్.. చిరంజీవితో నటించిన స్టార్ యాక్టర్ కన్నుమూత!