తెలుగు బుల్లితెర పాపులర్ కమెడియన్స్ లో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆది.. ముందుగా టీమ్ మెంబర్ గా చేరి ఆ తర్వాత తనశైలి కామెడీ పంచులు, ప్రాసలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా ఎదిగాడు. జబర్దస్త్ కి ముందు హైపర్ ఆది అంటే ఎవరికీ తెలియదు.. కానీ ఇప్పుడు హైపర్ ఆది అంటే తెలుగు రాష్ట్రాలలో తెలియనివారు లేరు.
ఈ మధ్యకాలంలో హైపర్ ఆది లేకుండా ప్రేక్షకులు జబర్దస్త్ కామెడీ షోను చూడలేకపోతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా హైపర్ ఆది స్కిట్ కోసమే జబర్దస్త్ చూసేవాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మకతప్పదు. ఆది కామెడీ పంచులకు అలాంటి క్రేజ్ ఉంది మరి. అయితే.. కొద్దిరోజులుగా హైపర్ ఆది జబర్దస్త్ షోలో కనిపించడం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అసలు ఏమైందని ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో రెండు, మూడు వారాలుగా హైపర్ ఆది కనిపించకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హైపర్ ఆది కనిపించకపోవడంతో.. కొంతకాలమేనా లేదా జబర్దస్త్ కి శాశ్వతంగా దూరం కానున్నాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవలే నటి రోజా మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు ప్రధాన కమెడియన్స్ లో ఒకరైన హైపర్ ఆది లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. మరి ఆది మళ్లీ వస్తాడా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక జబర్దస్త్ మాత్రమే కాకుండా హైపర్ ఆది.. అటు డాన్స్ షో ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలలో కూడా సందడి చేస్తున్నాడు. అడపదడపా స్పెషల్ ఈవెంట్స్ లో కూడా ఆది తన మార్క్ కామెడీ పండిస్తుంటాడు. ఆది పంచులు కడుపుబ్బా నవ్వించినా అప్పుడప్పుడు వివాదాలకు దారితీస్తుంటాయి. కానీ అవేవి పట్టించుకోకుండా ఆది సినిమాల్లో కూడా దూసుకుపోతున్నాడు. మరి ఇలాంటి సమయంలో ఆది జబర్దస్త్ లో కనిపించకపోవడం గమనార్హం. మరి హైపర్ ఆది గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.