మోస్ట్ లవ్‌బుల్ కపుల్స్ విరుష్క(విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ)ల ముద్దుల కూతురు వామికా ఫొటోలు ఎట్టకేలకు బయటికొచ్చాయి. చిన్నారి పుట్టినప్పటి నుంచి పాప ఫొటోలు బయటికి రాకుండా విరుష్క దంపతులు జాగ్రత్త పడ్డారు. అలా ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ. పాప ఫొటోలను ఎప్పుడు సోషల్ మీడియాలో పంచుకోలేదు. మొత్తానికి వామికా ఫొటో నెట్టింట ప్రత్యక్షమైంది.
సౌతాఫ్రికా పర్యటనకు విరాట్ కోహ్లీ సతీసమేతంగా వెళ్లగా.. వామికా ఫొటో మీడియాకు చిక్కింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఫొటోలో వామికా పూర్తి ముఖం కనిపించకున్నా.. ఆ చిన్నారి కళ్లు, ముక్కు మాత్రమే కనిపిస్తున్నాయి. అవి అచ్చం విరాట్ కోహ్లీ లానే ఉన్నాయని కోహ్లీ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. కాగా.. విరాట్ కోహ్లీ మాత్రం ‘దయచేసి.. పాప ఫొటో మాత్రం తీయకండి’ అని మర్యాదపూర్వకంగానే స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. విరాట్ మాటలను ఏ మాత్రం పట్టించుకోని ఫొటోగ్రాఫర్లు వామికా ఫొటో కోసం శతవిధాల ప్రయత్నించారు.
మొత్తానికి ఒక ఫొటోను మాత్రం పట్టి సోషల్ మీడియాలో పెట్టారు. అయితే 2021 జనవరి 11న జన్మించిన వామికా.. సౌతాఫ్రికా పర్యటనలోనే తొలి బర్త్‌డే జరుపుకోనుంది. మరి పాప ఫొటోను మీరూ చూశారు కదా? పాప కోహ్లీలా ఉందా? అనుష్క శర్మలా ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Vamika spotted by paparazzi pic.twitter.com/QyEIcW6eEN
— Nikhil Lodhi🇮🇳 (@_nikhil_lodhi_) December 16, 2021
‘Baby ka photo mat lena’: #ViratKohli tells paps as he leaves for South Africa with #AnushkaSharma, Vamika. @imVkohli, @AnushkaSharma #viratkohli #virat #viratkohlifanpage #anushkasharma #anushka #vamika #spotted #cricketer #etimes pic.twitter.com/nGwzSncCVR
— ETimes (@etimes) December 16, 2021