సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేశ్ శివన్ ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట గురువారం(జూన్ 9) వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. నాను రౌడీదాన్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ లవ్ బర్డ్స్ గత లాక్‌డౌన్‌లో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక వీరి వివాహ వేడుకకు రజనీకాంత్, షారుక్ ఖాన్, రాధికా శరత్ కుమార్, దర్శకుడు అట్లీ తదితరులు హాజరయ్యారు.
గత కొంతకాలంగా అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగొచ్చిన ఈ జంట జూన్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక తాను ఎంతగానో ఆరాధించే నటుడు రజనీకాంత్ చేతుల మీదుగా అందుకున్న మంగళ సూత్రాన్ని విఘ్నేశ్ తన ప్రియసఖి నయనతార మెడలో కట్టాడు. వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అభిమానులు వీరికి అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Nayanthara-Vignesh Shivan: భారీ ఆఫర్‌తో నయనతార-విఘ్నేష్ శివన్ వివాహ వేడుక ప్రచార హక్కులు దక్కించుకున్న సంస్థ
ఈ సందర్భంగా విఘ్నేశ్ సోషల్ మీడియాలో తమ ప్రేమ కావ్యాన్ని సింగిల్ లైన్‌లోనే అద్భుతంగా చెప్పుకొచ్చాడు. ‘నయన్ మేడమ్ నుంచి కాదంబరి, కాదంబరి నుంచి తంగమే.. తంగమే నుంచి నా బేబీ, నా బేబీ నుంచి నా ఉయిర్.. నా ఉయిర్ నుంచి కన్మణి, కన్మణి నుంచి ఇప్పుడు నా భార్యగా మారావు’ అంటూ లవ్ సింబల్ ఎమోజీలు పెడుతూ పెళ్లి ఫొటోలు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌తో పాటు వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
HUSBAND & WIFE #WikkiNayan #WikkiNayanWedding pic.twitter.com/EjNQU6Krla
— Nayanthara✨ (@NayantharaU) June 9, 2022
From Nayan mam … to Kadambari … to #Thangamey …. to my baby ….. and then my Uyir … and also my Kanmani ….. and now … MY WIFE 😇☺️😍😘❤️🥰🥰😘❤️😇😇😍😍 #WikkiNayanWedding #WikkiNayan pic.twitter.com/5J3QT71ibh
— Vignesh Shivan (@VigneshShivN) June 9, 2022
ఇది కూడా చదవండి: Wikki Nayan Wedding: నయనతార- విగ్నేష్ పెళ్లిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్!
Just 🫶🏻 #wikkynayanwedding #NayantharaVigneshShivan pic.twitter.com/LWCPdVwcDF
— Nayanthara✨ (@NayantharaU) June 9, 2022
🫶🏻😇 #WikkiNayanWedding #WikkiNayan pic.twitter.com/TeDrKDdxj8
— Nayanthara✨ (@NayantharaU) June 9, 2022
JUNE 09 🫶🏻💐👩❤️👨 #WikkiNayan #WikkiNayanWedding pic.twitter.com/wc5UzO8OHi
— Nayanthara✨ (@NayantharaU) June 9, 2022
On a scale of 10…
She’s Nayan & am the One ☝️☺️😍🥰
With God’s grace , the universe , all the blessings of our parents & best of friends
Jus married #Nayanthara ☺️😍🥰 #WikkiNayan #wikkinayanwedding pic.twitter.com/C7ySe17i8F
— Vignesh Shivan (@VigneshShivN) June 9, 2022