సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. తన అందం, అభినయంతో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. సినిమాలో దాదాపు అన్ని రకాల పాత్రల్లో నటించి అందరిని మెప్పించింది. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార.. నిజ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. గతంలో కొన్ని లవ్ ఫెయిల్యూర్స్ తో మానసికంగా నయనతార కుంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాతి కాలంలో దర్శకుడు విఘ్నేష్ శివన్ కు నయనతార బాగా దగ్గరైంది. ఈక్రమంలో వారిద్దరు ప్రేమలో పడటం.. పెళ్లి సిద్దమవుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే పెళ్లి విషయంలో విఘ్నేష్ తల్లి నయనతారకు ఓ కండిషన్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. పెళ్లి తరువాత సినిమాలకు పుల్ స్టాఫ్ పెట్టాలని చెప్పినట్లు సమాచారం.
తమ కుటుంబంలో ఎవరూ కూడా నటించడం లేదని అందుకే నయనతార కూడా సినిమాల్లో నటించకూడదని విఘ్నేష్ తల్లి కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. నయనతార సౌత్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు దాదాపు అందరితో కలిసి నటించింది. లేడీ ఓరియంట్ సినిమాలో నటించి అందరిని ఆకట్టుకుంది. ఈ అమ్మడు సినీరంగంలో ఎవరెస్టు అంత స్థాయికి ఎదిగింది. ఇండస్ట్రీలో అన్ని ఉన్నతులు చూసిన ఈ అమ్మాడు.. ఇక రియల్ లైఫ్ ను హాయిగా గడపాలని భావిస్తుందట. అందుకే విఘ్నేష్ తల్లి చెప్పిన విధంగానే నయనతార సినిమాలలో నటించనని తెలిపినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం నయనతార ఒప్పుకున్న సినిమాలన్నింటినీ పూర్తిచేసిన తర్వాత ఆమె తెరపై కనిపించదని తెలుస్తోంది.
ఇదీ చదవండి: మన పిల్లలకైనా ఆ విషయంలో సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్
నటిగా వెండితెరకు దూరమయినప్పటికీ నిర్మాతగా మాత్రం ఇండస్ట్రీలో కొనసాగుతానని నయనతార చెప్పినట్లు రూమర్స్ వినిపిస్తోన్నాయి. పెళ్లి అనంతరం నయనతార సినీ ఇండస్ట్రీకి దూరం అవుతారనే వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వార్త నయనతార అభిమానులు తెలియడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. తమ హీరోయిన్ ని ఇక నుంచి తెరపై చూడలేమా! అంటూ బాధపడుతున్నారు. అయితే ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. ఈ వార్తపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. మరి.. నయనతార గురించి వైరల్ అవుతోన్న ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.