ఇండస్ట్రీలో పెద్ద సినిమాల సందడి మొదలవుతోంది. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు అన్ని థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే సినిమాల రిలీజ్ డేట్స్ కూడా వచ్చేశాయి. అభిమాన స్టార్ల సినిమాలు డేట్స్ ప్రకటించేసరికి అభిమానులు కూడా ప్రిపేర్ అవుతున్నారు. అయితే.. ఫిబ్రవరి చివరి వారం నుండే తెలుగులో భారీ సినిమాల హవా స్టార్ట్ అవుతోంది.
ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఒకేరోజు గ్యాప్ తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు. అజిత్ నటించిన త్రిభాషా చిత్రం ‘వలిమై‘ ఫిబ్రవరి 24న రిలీజ్ అవుతుండగా.. ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్‘ మూవీ రాబోతుంది. అయితే.. వలిమై యాక్షన్ జానర్, భీమ్లా నాయక్ మాస్ సినిమా అయినప్పటికీ దేని క్రేజ్ దానికే ఉంటుంది.
ఇక ట్రైలర్ వ్యూస్ పరంగా రికార్డులు సృష్టిస్తున్న భీమ్లా నాయక్ మూవీ.. ‘బుక్ మై షో’ అడ్వాన్స్ బుకింగ్ విషయంలో అజిత్ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. ఇప్పటివరకు వలిమై సినిమాకి 2 మిలియన్స్ పైగా లైక్స్ రాగా, భీమ్లా నాయక్ కి 4 లక్షల లైక్స్ రావడం గమనార్హం. అజిత్ సినిమా త్రిభాషా అయినప్పటికీ, తెలుగులో పవన్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. పవన్ సినిమా వస్తుందంటే.. వేరే సినిమాలకి థియేటర్స్ కొరత ఏర్పడే అవకాశం ఉంది.
ఇక్కడ చూసుకుంటే.. వలిమై సినిమాకి మిలియన్స్ లో లైక్స్ రావడంతో.. తెలుగులో అజిత్ క్రేజ్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుందనేది అర్థమవుతుంది. ఇదిలా ఉండగా.. వలిమై క్రేజ్ వలిమైదే.. భీమ్లా క్రేజ్ భీమ్లాదే అంటున్నారు ఫ్యాన్స్. వలిమై సినిమాని హెచ్.వినోద్ తెరకెక్కించగా.. భీమ్లా నాయక్ మూవీని సాగర్ కే చంద్ర రూపొందించాడు. ఇక వలిమై, భీమ్లా నాయక్ లు ఏ విధంగా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తాయో చూడాలి. మరి వలిమై – భీమ్లా నాయక్ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.