మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసి ఎంతోమంది సినిమా రంగంలోకి వచ్చారు. నటులుగా, దర్శకులుగా ఎదిగారు. చిరంజీవి స్ఫూర్తితో రంగంలో అడుగుపెట్టి ఆయన పక్కన నటించడం, ఆయనను హీరోగా పెట్టి డైరెక్ట్ చేసిన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. చిరంజీవిని డైరెక్ట్ చేయడం అనేది అందరు దర్శకుల కల. ఆ కలను చాలా మంది నెరవేర్చుకున్నారు. ఇంకా కొంత ఆ పనిలో ఉన్నారు. అయితే గతంలో కొంతమంది అవకాశం వచ్చినా కూడా వదులుకున్న వాళ్లు కూడా లేకపోలేదు. వారిలో కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ ఉపేంద్ర కూడా ఒకరు.
ఇదీ చదవండి: బాలీవుడ్ ఎంట్రీ పై మహేష్ బాబు క్లారిటీ! సూపర్ పంచ్!
ఉపేంద్ర తాజాగా వరుణ్ తేజ్ గని సినిమాలో నటించిన విషయం తెలిసిందే. గని సినిమా ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఉపేంద్ర మాట్లాడుతూ కొన్ని పాత విషయాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ‘నాకు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో రిలేషన్ ఇప్పటి నుంచి కాదు. 24 ఏళ్ల క్రితం రాజశేఖర్ తో ఓంకారం అనే సినిమా చేస్తున్నాను. ఆ సమయంలో అశ్వినీ దత్ నన్ను చిరంజీవిని డైరెక్ట్ చేయమన్నారు. నాకు అదృష్టంలేక ఆ సినిమా చేయలేకపోయాను. ఆ సినిమా చేయనందుకు ఇప్పటికీ బాధపడుతుంటాను’ అంటూ ఉపేంద్ర ఎమోషనల్ అయ్యాడు. ఇంక సినిమాల విషయానికి వస్తే.. ఉపేంద్ర హీరోగా ఓ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాకి ఉపేంద్రనే డైరెక్టర్. అది కాకుండా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నాడు. ఉపేంద్ర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.