ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. పాన్ ఇండియా పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మోగిస్తున్న సంగతి తెలిసిందే. అద్భుతమైన కలెక్షన్స్ తో పాత రికార్డులను తొక్కుకుంటూ దూసుకుపోతుంది. అయితే.. ఈ సినిమాలో ప్రధాన నటుల నుండి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.
ఇక ట్రిపుల్ మూవీ చూసినవారంతా.. సినిమాలోని నటుల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ప్రధాన నటులు కాకుండా చిన్నవే.. అయినా కథలో ప్రాధాన్యత కలిగిన క్యారెక్టర్స్ లో మెరిసిన యాక్టర్స్ వివరాల కోసం వెతుకుతున్నారు. అయితే.. ప్రధాన పాత్రలు పోషించిన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్, శ్రీయ, ఒలీవియా మోరిస్, సముద్రఖని, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీరిలో చాలావరకు తెలుగు ప్రేక్షకులకు తెలిసినవారే.
తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని నటులు ట్రిపుల్ ఆర్ లో కీలక పాత్రలలో మెరిసి అందరినీ ఫిదా చేశారు. మరి RRRలో క్యారెక్టర్స్ పోషించిన ఆర్టిస్టులు (తెలుగు జనాలకు తెలియనివారు) ఎవరో చూద్దాం!
1) మల్లి
ఆర్ఆర్ఆర్ మూవీలో కీలకపాత్ర ఇది. సినిమా కథ మల్లి పాత్రతోనే మొదలవుతుంది. మల్లి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ ట్వింకిల్ శర్మ నటించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ట్వింకిల్.. డాన్స్ ఇండియా డాన్స్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.
2) లోకి
ఈ సినిమాలో గోండు బిడ్డ మల్లికి తల్లి పాత్ర ఇది. ఈ పాత్రలో అహ్మరీన్ అంజుమ్ నటించింది. బాలీవుడ్ లో మంచి పేరున్న అంజుమ్.. SIR, క్లాస్ ఆఫ్ 83 (సినిమాలు), సూర్య కి అంతిమ్ కిరణ్ సే సూర్య కి పెహ్లి కిరణ్ తక్ (టీవీ సిరీస్) లలో నటించింది. ఇక అంజుమ్.. షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ గా, ఎడిటర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
3) యంగ్ రామరాజు
సినిమాలో రామ్ చరణ్ చిన్నప్పటి క్యారెక్టర్ రామరాజుగా వరుణ్ బుద్ధదేవ్ నటించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ లో బాలీవుడ్ లో పాపులర్ అయిన వరుణ్.. చిన్నప్పటి నుండే టీవీ యాడ్స్, సీరియల్స్, మూవీస్ లో నటించడం స్టార్ట్ చేశాడు. RRR కి ముందు వరుణ్.. తులసీదాస్ జూనియర్(మూవీ), ది ఎంపైర్(వెబ్ సిరీస్) లలో నటించాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’ మూవీ, యార్ దోస్త్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.
4) జెన్నిఫర్
ఈ సినిమాలో కొమరం భీమ్(ఎన్టీఆర్)ని ఇష్టపడే బ్రిటిష్ యువరాణి క్యారెక్టర్ ఇది. ఈ పాత్రలో ఒలీవియా మోరిస్ నటించింది. ఒలీవియా ఒక ఇంగ్లీష్ నటి. 2018లో ‘రాయల్ వెల్ష్ కాలేజీ ఆఫ్ డ్రామా అండ్ మ్యూజిక్’ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. లండన్ బ్లూస్ అనే మ్యూజిక్ వీడియో ద్వారా కెరీర్ ప్రారంభించింది.
5) ఎడ్వర్డ్
ఈ క్యారెక్టర్ లో ఎడ్వర్డ్ అనే అమెరికన్ యాక్టర్ నటించాడు. ఇతను బాలీవుడ్ లో చాలా సినిమాలే చేశాడు. ఫిరంగి, వీరే ది వెడ్డింగ్, మణికర్ణిక, కేసరి, ఆర్ఆర్ఆర్ లతో పాటు కపిల్ శర్మ కామెడీ షోలో కూడా మెరిశాడు.
6) యంగ్ సీత
సినిమాలో అలియా భట్ చిన్నప్పటి సీత క్యారెక్టర్ లో చైల్డ్ ఆర్టిస్ట్ స్పందన్ చతుర్వేది నటించింది. హిందీలో సీరియల్స్ తో పాటు ఉడాన్(సీరియల్), శకుంతలాదేవి సినిమాల్లో నటించింది.
7) స్కాట్ దొర భార్య క్యాథెరిన్
ఈ పాత్రలో ఐరిష్ యాక్ట్రెస్ అలిసన్ డూడి నటించింది.
8) స్కాట్ దొర
ఈ క్యారెక్టర్ లో నార్త్ ఐర్లాండ్ యాక్టర్ రే స్టీవెన్ సన్ నటించాడు.
9) చిన్నా(రామరాజు తమ్ముడు)
ఈ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి నటించాడు.