డార్లింగ్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ ‘రాధే శ్యామ్‘. రాధాకృష్ణకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా తాజాగా థియేట్రికల్ రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ లవ్ స్టోరీ.. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. అయితే.. రాధేశ్యామ్ విజయం పై సోషల్ మీడియాలో చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్.
ఇక రాధేశ్యామ్ సినిమాకి జస్టిన్ ప్రభాకర్ సాంగ్స్, మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. రాధేశ్యామ్ విషయంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన తమన్ కి స్పెషల్ క్రెడిట్ దక్కుతోంది. సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ ని తన బిజీఎమ్ తో హైలైట్ చేశాడని ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో రాధేశ్యామ్ సక్సెస్ సందర్భంగా విష్ చేస్తున్న వారందరికీ తమన్ ట్విట్టర్ లో థాంక్స్ చెబుతున్నాడు.ఇక సినిమాకి రివ్యూలు, రేటింగ్స్ కూడా పాజిటివ్ గా రావడంతో సంతోషం వ్యక్తం చేసిన తమన్.. ‘సినిమా బాగుంది కానీ స్లోగా ఉంది’ అనేవారికి సెటైరికల్ మీమ్ తో కౌంటర్ వేశాడు. అందులో ‘రాధేశ్యామ్ సినిమా ఎలా ఉంది?’ అంటే.. మూవీ బాగా స్లో ఉంది అన్నారు. దానికి కౌంటర్ గా.. “నేను అడిగింది సినిమా ఎలా ఉందని.. లవ్ స్టోరీ స్లోగా కాకుండా ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ నైట్, సెకండాఫ్ లో సెకండ్ సెటప్ పెట్టాలా ఏంటి” అని ఉంది. అదేవిధంగా ‘బ్లాక్ బస్టర్ రాధేశ్యామ్’ అనే హ్యాష్ ట్యాగ్ షేర్ చేసి.. ‘స్లో అంట.. నువ్వు పరిగెత్తాల్సింది మరి.. అదిరింది మీమ్’ అన్నాడు. ప్రస్తుతం తమన్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి తమన్ మీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#BlockBusterRadheShyam 💥💥💥💥💥💥
Slowwwww antaaaaa … Nuvvvvuuu parrigethaaaalsindhiiiii 🤣🤣🤣🤣
Adhirindhiiiii memmeee !! 🍭🍭🍭🍭🎭🤪 pic.twitter.com/SGW10l5w5h
— thaman S (@MusicThaman) March 11, 2022