సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంటనే క్లిక్ అవ్వాలంటే ఖచ్చితంగా అదృష్టంతో పాటు మంచి అవకాశాలు కూడా వచ్చి ఉండాలి. కొంతమంది భామలు వాళ్ళ అందంతోనో, గ్లామర్ తోనో మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరవుతారు. కానీ కొందరి విషయంలో ఎంత ప్రయత్నించినా, ఎంతలా అందాలను ఒలకబోసినా ఫేమ్ రావడం కష్టమే అవుతుంది. అయితే.. తెలుగు ఇండస్ట్రీలో సినిమాలకంటే సోషల్ మీడియాలో అందాలను ఆరబోసి క్లిక్ అయ్యే తారలు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మడివాడ ఒకరు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో క్లిక్ అయిన ఈ తెలుగు సోయగం.. ఆ తర్వాత ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ.. సెకండ్ హీరోయిన్ గా అవకాశాలను చేజిక్కించుకుంది. సినిమాలైతే చేసింది కానీ.. కెరీర్ పరంగా ఇంతవరకు సరైన బ్రేక్ గానీ, క్రేజ్ గానీ అందుకోలేదు. మధ్యలో రూటు మార్చి స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫుల్లుగా గ్లామర్ షో చేసింది. ఆ విధంగా కూడా తేజస్వి క్లిక్ అవ్వలేకపోయింది. ఇక లాభం లేదని బిగ్ బాస్ లో అడుగుపెట్టి మంచి క్రేజ్ దక్కించుకుంది. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా డెవలప్ చేసుకుంది. కానీ అక్కడ కూడా ఎక్కువకాలం ఉండలేకపోయింది. చివరికి బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక అందాల షో డోస్ పెంచేసింది. ఇటీవలే బిగ్ బాస్ ఓటిటి నాన్ స్టాప్ లో కూడా పాల్గొని కొన్ని వారాలకే బయటికి వచ్చింది. అయితే.. ఏదేమైనా నెట్టింట అందాలతో రచ్చ లేపడం మాత్రం ఆపలేదు. తాజాగా తేజస్వి పోస్ట్ చేసిన ఫోటోలు సెగలు రేపుతున్నాయి. వర్కౌట్ చేస్తూ నడుము చూపిస్తున్న పిక్స్ షేర్ చేసింది. అంతే కుర్రకారు ఊరుకుంటారా.. తేజస్వి స్కిన్ షోని అలా విరాళ చేస్తున్నారు. ప్రస్తుతం అమ్మడి పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. మరి తేజస్వి లేటెస్ట్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)