ఖుషీ సినిమా షూటింగ్ లో కశ్మీర్ లో హీరో విజయ్ దేవరకొండ- సమంతకు గాయాలు అయ్యాయంటూ వార్తలు రావడం.. వాటిని చిత్ర బృందం ఖండించడం చూశాం. విజయ్ దేవరకొండ, సమంతకు ఎలాంటి గాయాలు కాలేదని మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఖుషీ సినిమాకి సంబంధించి కశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసుకున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ రియల్ లైఫ్ లో జరిగిన ఓ ప్రమాదం గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదం జరిగితే విజయ్ దేవరకొండ అంత చిల్ గా ఉన్నాడా అంటూ అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ స్వయంగా తెలియజేశాడు.
డైరెక్టర్ కమ్.. యాక్టర్ కమ్.. సింగర్ కమ్.. పెయింటర్ కమ్.. డాన్సర్ కమ్.. ఇలా చెప్పుకుంటూ పోతే తరుణ్ భాస్కర్ టాలెంట్స్ పూర్తి చేయాలంటే చాలా టైమ్ పడుతుంది. తరుణ్ ఇటీవల ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నాడు ఆ షోలో చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అన్నింటికంటే తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ, ప్రియదర్శి జీవితంలో జరిగిన రియల్ యాక్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు.
An explosion of Happiness, laughter, Love and family bonding ❤️#Kushi – Telugu Tamil Kannada Malayalam Dec 23 Worldwide Release
Spread the joy this Christmas, New Years 😍@Samanthaprabhu2 @ShivaNirvana @MythriOfficial @HeshamAWMusic pic.twitter.com/HT3C38IT7I
— Vijay Deverakonda (@TheDeverakonda) May 16, 2022
‘ఓ రోజు పెళ్లి చూపులు షూట్ లో మేము ఉన్న ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. బ్రేక్ ఫెయిల్ అయ్యింది అనగానే విజయ్ దేవరకొండ చిల్ అయిపోయాడు. ప్రియదర్శి హ్యండ్ బ్రేక్ లాగగానే.. ఊడి చేతికి వచ్చింది. మా పని అయిపోయిందని అర్థమైపోయింది. తర్వాత ట్రక్కు ఓ చెట్టు దగ్గర ఆగింది. నేను బతుకుతానా లేదా అనే దానికన్నా విజయ్ దేవరకొండ్ అంత కూల్ గా ఎందుకు ఉన్నాడు అనే ఆసక్తి ఎక్కువైంది.’
‘వెంటనే అతని దగ్గరికి వెళ్లి.. బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అని చెబితే ఎందుకు అంత కూల్ గా ఉన్నావ్? అని అడిగాను. అందుకు విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ.. మొదట నాకూ భయం వేసింది. కానీ, ఆ తర్వాత కామ్ అయిపోయాను.. చస్తే ముగ్గురు కలిసే చస్తాం కదా అని చిల్ అయ్యాను. అని సమాధానం చెప్పాడు. నాకు కాసేపు మైండ్ పనిచేయలేదు’ తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు.
The Biggest film of my career X
The Funniest Beautiful love story. pic.twitter.com/gLbur4stdA— Vijay Deverakonda (@TheDeverakonda) May 12, 2022
ఇంక విజయ్ తో మళ్లీ సినిమా ఎప్పుడూ అని అడగ్గా.. ‘విజయ్ నాకు వైల్డ్ కార్డ్ లాంటి వాడు.. వరుసగా ఓ మూడు సినిమాలు ఫ్లాపులు అయితే అప్పుడు విజయ్ తో సినిమా చేస్తా’ అంటూ తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ప్రమాదం జరిగింది అని చెప్పాక విజయ్ చెప్పిన ఆన్సర్ చూసి అంతా షాకవుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రౌడీ బాయ్ ఆన్సర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.