Thoorigai: ప్రముఖ తమిళ పాటల రచయిత కాబిలన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు తూరిగై ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని అరుంబాక్కమ్లో ఉన్న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తూరిగై ఆత్మహత్యకు గల సరైన కారణాలు అయితే తెలియరాలేదు. డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని సమాచారం కోసం అన్వేషిస్తున్నారు. కాగా, తూరిగై కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. అంతేకాదు! ఆమె ‘బీయింగ్ ఉమన్’’ అనే మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మ్యాగజైన్ ప్రముఖ తమిళ దర్శకులు పా.రంజిత్, చేరన్.. నటి విమలా రామన్ల చేతుల మీదుగా 2020లో మొదలైంది. కాగా, కాబిలన్ తమిళ చిత్రసీమలో పేరుగాంచిన పాటల రచయిత. ఆయన ఇప్పటి వరకు దాదాపు 500 పాటలు రాశారు. ఆయన పాటలు రాసిన ‘‘పొన్నియన్ సెల్వన్, పిశాసు-2 సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. మరి, కాస్ట్యూమ్ డిజైనర్ తూరిగై కాబిలన్ ఆత్మహత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి: Childhood Pic: ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?