సినీ ఇండస్ట్రీని ఒక్క కుదుపు కుదిపేసింది మీటూ ఉద్యమం. ఎంతో మంది నటీమణులు, ఇంతర రంగాల్లో పనిచేసేవారు గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించి ఎన్నో విషయాలు బయట పెట్టారు. కాస్టింగ్ కౌచ్ గురించి ఎంతో మంది హీరోయిన్లు తమపై జరిగిన అఘాయిత్యాలను సోషల్ మీడియా ద్వారా వెల్లబుచ్చుతున్నారు. గత కొంత కాలంగా ఒక మహిళను వేధిస్తున్న కేసులో ప్రముఖ కోలీవుడ్ ప్రొడ్యూసర్ వారాహిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
కోలీవుడ్ లో పలు హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన వారాహి చెన్నైలో ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. ఆయన ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఒక ప్లాట్ లో ఉంటున్న రాణి అనే మహిళను వారాహి కొంత కాలంగా ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకోవాలని వెంటపడుతూ.. వేధిస్తూ ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు అతని వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో తెలిపింది. రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జరిపిన విచారణలో నిర్మాత రాణిని వేధించినట్లు నిర్ధారించారు. దీంతో నిందితుడిని సోమవారం కటకటాల్లోకి నెట్టారు.