శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యూట్యూబర్, జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి(డాలీ డీ క్రూజ్).. పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటించి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. గాయత్రిని అందరూ ముద్దుగా డాలీ అని పిలిచేవారు. అందుకే స్క్రీన్ నేమ్ కూడా తను అలానే మర్చుకుంది. సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనేది ఆమె కల. అందుకే కొన్ని సినిమాల్లో కూడా నటించింది. మంచి పేరు తెచ్చుకుంది. తనను తాను వెండితెరపై చూసుకుని మురిసిపోయేది గాయత్రి. సెలబ్రిటీలతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. కానీ ఏం లాభం వెండితెరపై ఓ వెలుగు వెలగకుండానే అందరని కాదని.. వదిలి వెళ్లిపోయింది.
ఆర్టిస్ట్ సురేఖావానీతో గాయత్రికి మంచి పరిచయం ఉంది. తన కూతురు సుప్రితను చూసుకున్నట్లే గాయత్రిని కూడా సురేఖావాణి అంతే ప్రేమతో చూసుకునేది. ముగ్గురు కలిసి ట్రిప్స్‌కు కూడా వెళ్లేవాళ్లు. ఎంజాయ్ చేసేవాళ్లు. ఆ ముగ్గురు కలిసి చేసిన డ్యాన్స్‌ను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు సురేఖావాణి. వెబ్‌సీరీస్‌లు చేస్తూనే కొన్ని సినిమాల్లో కూడా తళుక్కుమనింది గాయత్రి. చిన్న రోల్స్ చేసి ఓ గుర్తింపు తెచ్చుకుంది. అటు చదువును నిర్లక్ష్యం చేయకుండా, తన ప్యాషన్‌ను కూడా వదలకుండా ముందుకు సాగింది. కానీ ఇప్పుడు.. ఒంటరిగా.. తను కన్న కలలన్ని తనతో పాటే తీసుకెళ్తోంది. డాలీ వీ మిస్ యూ అంటూ సురేఖ ఎమోషనల్ అయ్యారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.