తెలుగు చలనచిత్ర రంగంలో హీరోయిన్స్ కి కొరత ఉందేమో గాని.., అందమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకి మాత్రంA లోటు లేదు. హోమ్లీ క్యారెక్టర్స్ లో కనిపిస్తూనే., ప్రేక్షకులను తమ అందంతో మంత్ర ముగ్ధులను చేయగల ఆర్టిస్ట్ లు ఒక అరడజను మంది పైగానే ఉన్నారు. కానీ.., వీరిలో సురేఖవాణి స్థానం మాత్రం ప్రత్యేకం. ఎలాంటి పాత్రలో అయినా ఉదిగిపోయి నటించగలగడం ఈమె ప్రత్యేకత. ఇక ఈ మధ్య కాలంలో సురేఖవాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకుంటే.., సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈమె ఒక్కటే కాదు. సురేఖతో పాటు ఆమె కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
ముందుగా తల్లితో కలసి ఫోటో సెషన్స్ తో దుమ్ము రేపిన సుప్రిత ఇప్పుడు ఒంటరిగానే లైవ్ లోకి వచ్చే రేంజ్ కి ఎదిగింది. చూడటానికి అప్ కమింగ్ హీరోయిన్ లా అనిపించే సుప్రితకి నెటిజన్స్ నుండి చిత్ర విచిత్రమైన ప్రశ్నలు ఎదురవ్వడం, వాటికి ఈ అమ్మడు స్ట్రాంగ్ రిప్లయ్స్ ఇవ్వడం గత కొన్ని రోజులుగా జరుగుతూ వస్తోంది. కానీ.., తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.., సురేఖవాణి కూతురు టంగ్ స్లిప్ అయ్యి అడ్డంగా దొరికిపోయింది.
మీరు సిట్టింగ్ లో ఉన్నప్పుడు ఓ సిప్ తాగాక ఒంటరిగా ఫీల్ అవుతారా? అని ఓ నెటిజన్ ప్రశ్నకు సుప్రిత సమాధానం ఇచ్చింది. నాకు మందు అలవాటు లేదని ముందే చెప్పాను. కానీ.., వైన్ బాటిల్ తాగాక మాత్రం అలా ఒంటరిగా ఫీల్ అవుతానేమో అని సమాధానం సుప్రిత ఇచ్చింది. దీంతో.., సుప్రితకి వైన్ తాగే అలవాటు ఉందా అంటూ నెటిజన్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇక కొన్ని రోజుల ముందే సుప్రిత చనిపోయిన తన తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ విషయంలో ఆమెకి పెద్ద ఎత్తున సపోర్ట్ లభించింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం సుప్రిత టాలీవుడ్ లో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.