సినీ ప్రియులకు ఇండస్ట్రీలోని గ్లామరస్ బ్యూటీల గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. కెరీర్ ప్రారంభం నుండి వారు రేపిన సంచలనాలే వారికి అభిమానులను తెచ్చిపెట్టి, ఎప్పటికి మర్చిపోకుండా చేస్తుంటాయి. అలా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టకముందే సంచలనం రేపి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న అందాలతార సన్నీలియోన్.
సన్నీ గురించి తెలియని వారుండరు. హిందీ బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా టీవీ ప్రేక్షకులకు పరిచయమైన సన్నీ.. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి సినీ ఫ్యాన్స్ కి దగ్గరైంది. అనతి కాలంలోనే ‘బాలీవుడ్ ఐటమ్ బాంబ్’గా పేరు తెచ్చుకుంది. ఆ వెంటనే సినిమాలలో వరుస అవకాశాలు అందుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో కూడా డెబ్యూ చేసింది. కానీ ఎక్కడికి వెళ్లినా సన్నీకి కుర్రకారు నీరాజనాలు పడుతున్నారు.
ఏదైనా పాటలో, సీన్ లో సన్నీ కనిపించిందంటే చాలు.. యూత్ లో క్రేజ్ మామూలుగా ఉండదు. ఆ తర్వాత తెలుగులో కూడా అడుగుపెట్టిన సన్నీ.. ఐటమ్ సాంగ్స్ తో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇక ఓవైపు సినీ కెరీర్ ని, మరోవైపు భర్త, పిల్లలతో లైఫ్ హ్యాపీగా గడుపుతోంది. త్వరలోనే ‘గాలి నాగేశ్వర్రరావు’ సినిమాలో కనిపించనుంది. ఇదిలా ఉండగా.. తాజాగా సన్నీ భర్త డేనియల్ తో కలిసి బాస్కెట్ బాల్ ఆడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో సన్నీ చీరకట్టుకొని, భర్తతో పోటీపడుతూ ఆట ఆడటం చూడవచ్చు. మరి అభిమాన సన్నీలియోన్ కొత్త వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.