SUJATHA: బుల్లితెరలో రష్మీ-సుధీర్‌ల జంట తర్వాత రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాతల జంట చాలా ఫేమస్ అయింది. తాము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని రాకేష్, సుజాతలు చాలా వేదికల్లో చెప్పారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఇప్పటికే అంగీకరించాయని, వీరిద్దరూ త్వరలో పెళ్లి పీఠలు కూడా ఎక్కబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఈ జంట జబర్ధస్త్ కామెడీ షోలో స్కిట్లు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. స్కిట్ల ప్రాక్టీస్ కోసం రాకేష్‌తో ఎక్కువ సమయం గడుపుతున్న సుజాత అతడు తన ఫోన్‌తో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించింది. అతడికి తన కానుకగా ఓ కాస్ట్‌లీ ఫోన్‌ను అందించింది. సామ్‌సంగ్ గెలాక్సీ S 22 అల్ట్రా ఫోన్‌తో పాటు స్మార్ట్ వాచ్‌ను కొనిచ్చింది. ఆ గిఫ్ట్ తనకోసమే అని తెలిసి రాకేష్ సర్‌ఫ్రైజ్ అయ్యాడు. సుజాత రాకేష్‌కు గిఫ్ట్ కొనిస్తున్న వీడియోను తన అఫిషియల్ యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేసింది. రాకేష్‌కు ఫోన్ కొనివ్వటానికి గల ప్రధాన కారణాన్ని వీడియోలో పేర్కొంది.
‘ నా ఒక ఆత్మీయుడు, స్నేహితుడు,అండ్ ఇంకా ఇంకా.. రాకేశ్‌కు ఫోన్ కొనిస్తున్నాను. తను కొద్దిరోజుల నుంచి మొబైల్‌తో ఇబ్బందిపడుతున్నాడు. పైగా అతనికి కోపం వస్తే ఫోన్ పగలగొట్టే అలవాటు ఉంది. నేను అతడి మనసుకు దగ్గరైన వ్యక్తిని కాబట్టి నేను ఫోన్ కొనిస్తే దాన్ని పగలగొట్టడానికి ఆలోచిస్తాడు కదా అనిపించింది. తను నాకు దగ్గరైనప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాను, నా ప్రతీ విజయంలో రాకేశ్ ఉన్నాడు. నేను ఫోన్ గిఫ్టిస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడనిపించింది, అందుకే ఈ ఫోన్ బహుమతిగా ఇస్తున్నాను’ అని పేర్కొంది. మరి, రాకేష్‌కు సుజాత కాస్ట్‌లీ గిఫ్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Review Laxman: ప్రాంక్ వీడియో వెనకున్న అసలు విషయాలు బయటపెట్టిన రివ్యూ లక్ష్మణ్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.