గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న సమస్య పైరసీ. సినిమాలు థియేటర్లో రిలీజ్ అయిన గంటల్లోనే వాటిని పైరసీ చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. పెద్ద, చిన్నా ఏ సినిమా అయినా సరే రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక షూటింగ్ సమయాల్లో లోకేషన్ కి సంబంధించిన పిక్స్ లీక్ అవుతునే ఉన్నాయి. ఇండస్ట్రీకి చెందిన వారు ఎంత పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నా లీక్ రాయుళ్లు ఎలాగో అలా తమ పని తాము కానిచ్చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారువారి పాట సినిమాలోని కళావతి పాట ఆన్‌లైన్‌లో లీకైన విషయం తెలిసిందే. ఎంతో ఆవేదనతో థమన్ వీడియో రూపంలో స్పందించారు. మనసు చాలా బాధగా ఉందని, తనకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదని అన్నారు. ఎంతో కష్టపడ్డామని, ఆర్నెల్లుగా ఈ వీడియో కోసం ఎంతో కష్టపడ్డామని, కొవిడ్ వేళ రాత్రి, పగలు అందరం కలిసి శ్రమించామని.. తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చిందని, అయినప్పటికీ ఈ పాట కోసం చాలా కష్టపడ్డారని తెలిపారు.
ఇది చదవండి: నెరవేరబోతున్న మంచు లక్ష్మీ కల.. ఎమోషనల్ ట్వీట్!
ఈ పాటకు అద్భుతమైన లిరిక్స్ రాశారని, డైరెక్టర్ ఎంతో సంతోష పడ్డారని చెప్పారు. ఎంతో ఉత్సాహంగా చేసిన లిరికల్ వీడియో ప్రపంచంలోనే బెస్ట్ అనేలా చేశామని తెలిపారు. ఈ పాటకు ఎంతో టెక్నాలజీని వాడామని అన్నారు. నిర్మాత పెట్టుబడి, తాము తమ హీరోకి చూపించాల్సిన ప్రేమ, అభిమానం మా పాటలో ఉంటుందని అన్నారు. ఎవడో తమ ప్రాణాలని తీసుకుని చాలా చాలా ఈజీగా ఆన్‌లైన్‌లో పెట్టేశాడని థమన్ ఆవేదనాభరిత వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వాయిస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Heartbroken 💔 !! pic.twitter.com/tO75lsUND6
— thaman S (@MusicThaman) February 12, 2022