ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు రావాలంటే కాళ్లు అరిగేలా తిరగాలి. అయినా కూడా ఫలితం ఉండదు. చాలా మందికి మంచి గుర్తింపు సంపాదించాలనే తపన ఉన్న ఆ కోరికలు అలాగే మిగిలిపోయేవి. అయితే నేటి కాలంలో అలాంటి వారికి సోషల్ మీడియా మంచి వేదికగా మారింది. రీల్స్, ఇన్ స్టా , టిక్ టాక్ వీడియోలు అంటూ మొదలైనవి చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి వీవర్స్ ఆకట్టకుంటున్నారు. అలా చాలామంది షార్ట్ ఫిల్మ్ చేస్తూ పేరుతో పాటు మంచి సంపాదన కూడా అర్జీస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు యూ ట్యూబ్ స్టార్ ప్రశు బేబి. మొదట టిక్ టాక్ ల ద్వారా మొదలు పెట్టి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ గా ఎదిగాడు. మరి.. ప్రశు బేబి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రశు.. పూర్తి పేరు ప్రశాంత్.. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలోకి చెందిన ఇతను ఇంజనీరింగ్ చదివాడు. అనంతరం ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాడు. ఈక్రమంలోనే టిక్ టాక్ వీడియోలు చేసేయడం ప్రారంభించాడు. అలా ఎమోషనల్ వీడియోలు చేస్తూ అందరిని ఆకట్టుకునే వాడు. అలా టిక్ టాక్ వీడియోల ద్వారా మొదట గుర్తింపు పొందాడు. అనంతరం టిక్ టాక్ బ్యాన్ చేయడంతో యూట్యూబ్ బాటపటాడు. ఈసారి కంటెంట్ మార్చి షార్ట్ ఫిల్మ్ వీడియోలు చేయడం ప్రారంభించాడు. ప్రశాంత్ నెటిజన్ల నుంచి అనేక విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు. లాక్ డౌన్ టైమ్ లో సింపుల్ సింపుల్ గా కంటెంట్ తో వీడియోలు చేశాడు. ప్రస్తుతం ప్రశు బేబి కి 43 లక్షల మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. పెళ్లి చూపులు, పెళ్లైన కొత్తలో, పెళ్లి తరువాత లాంటి సిరీస్ వీడియోలు చేస్తున్నాడు. గతంలో దొంగబాబా స్కామ్ లు, స్నేహితుల మధ్య బాడింగ్, చిన్న పిల్లల వీడియోస్ ని ఫన్నీగా చూపిస్తునే మంచి మేసేజ్ ఇస్తుంటాడు. దీంతో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఫ్యాన్ ఉన్నారు. ఇంతల పేరు సంపాందించిన ప్రశాంత్ లైఫ్ లో కూడా అనేక ట్విస్ట్ లు ఉన్నాయి. మరి.. ప్రశాంత్ గురించి పూర్తి వివరాలకు కింది వీడియోను వీక్షించండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.