ప్రముఖ టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్, ఇండియన్ ఐడల్-9 విన్నర్ రేవంత్.. తన బ్యాచిలర్ లైఫ్ కి బైబై చెబుతూ అన్విత మెడలో మూడుముళ్లు వేసి ఓ ఇండివాడయ్యాడు. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్ లో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో కేవలం ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితులు వీరి వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. రేవంత్ వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖలు సైతం హాజరయ్యారు.
రేవంత్, అన్వితల నిశ్చితార్థం గతేడాది డిసెంబర్ 24న జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ నిశ్చితార్థం ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం రేవంత్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక రేవంత్ విషయానికి వస్తే.. ఇతని పూర్తిపేరు లోల వెంకట రేవంత్ కుమార్ శర్మ. ఏపీలోని శ్రీకాకుళం స్వస్థలం. చదువుకునే సమయంలో సంగీతంపై ఆసక్తి పెంచుకున్నాడు. పలు మ్యూజిక్ కాంపిటీషన్స్, టీవీ రియాల్టి షోలలో పాల్గొని సత్తా చాటాడు. ఈక్రమంలోనే ఇండియన్ ఐడల్-9 టైటిల్ గెల్చుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.
ఆ తర్వాత సింగర్ గా తెలుగుతో పాటు కన్నడ సినిమా ఇండస్ట్రీల్లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు రేవంత్ దాదాపు 200కు పైగా పాటలు పాడినట్లు తెలుస్తుంది. ఇండియన్ ఐడల్ టైటిల్ తర్వాత ‘మనోహరి’ పాటతో రేవంత్ పేరు మార్మోగిపోయింది. ఇక ఇటీవల విడుదలైన “ఆచార్య” సినిమాలోని ‘సానా కష్టం’ పాట కూడా రేవంత్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న రేవంత్ పెళ్లి ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.