సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. అభిమానులతో వెంటనే కనెక్ట్ అవుతున్నారు హీరో హీరోయిన్లు. షూటింగ్ నుంచి తీరిక దొరికితే.. ఇన్ స్టాలో అభిమానుల్ని పలకరిస్తున్నారు. అయితే కొన్ని సార్లు.. అభిమానుల నుంచి చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. తింగరి ప్రశ్నలు అడుగుతుంటారు నెటిజనులు. కొన్ని సార్లు.. మౌనంగా ఉన్నా.. అప్పుడప్పుడు గట్టిగా కౌంటర్ ఇస్తుంటారు. తాజాగా ఇదే పని చేశారు హీరోయిన్ శ్రుతీ హాసన్. గురువార ఇన్ స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు శ్రుతి హాసన్.
ఈ సందర్భంగా ఓ నెటిజన్.. శ్రుతి ఇప్పటివరకు మీ జీవితంలో ఎంతమందితో బ్రేకప్ చేసుకున్నారు అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు చిర్రెత్తుకొచ్చిన శ్రుతి హాసన్.. మీకెంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు.. అని ప్రశ్నించారు. నువ్వు ప్రశ్నలు అడిగిన విధానం బట్టి చూస్తే.. నీకసలు గర్ల్ ఫ్రెండ్ లేదని నాకనిపిస్తోంది అంటూ ధీటుగా సమాధానం చెప్పారు.
ఇది కూడా చదవండి : ఆమెకే ఆర్ధిక ఇబ్బందులంటే సాధారణ జనం సంగతేంటీ బాసూ…
శ్రుతి హాసన్.. హీరోయిన్ గా చేస్తున్న సమయంలోనే లండన్ కు చెందిన వ్యక్తిని ప్రేమించారు. ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది రోజుల తర్వాత విడిపోయారు. ప్రస్తుతం శ్రుతి హాసన్ శాంతను అనే ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ తో రిలేషన్ లో ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శ్రుతి హాసన్.. బాలకృష్ణ హీరోగా.. గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నారు.