తెలుగు టీవీ ప్రేక్షకులు ఆదరించే కామెడీ షోలలో జబర్దస్త్ ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతమంది తమ టాలెంట్ ప్రూవ్ చేసుకొని సినిమా ఇండస్ట్రీలో కూడా కొనసాగుతున్నారు. అయితే.. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, రాఘవ, హైపర్ ఆది ఇలా అందరూ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.
అప్పుడప్పుడు జబర్దస్త్ షోలో కొత్త కొత్త ముఖాలు దర్శనమిస్తుంటాయి. ప్రేక్షకులు కొత్త వాళ్ళను ఆదరిస్తూనే ఉంటారు. ఈ మధ్య సీరియల్ ఆర్టిస్టులు కూడా జబర్దస్త్ షోలో పాల్గొని కామెడీ పండిస్తున్నారు. తాజాగా రాకింగ్ రాకేష్ టీమ్ లో మెరిసిన సీరియల్ ఆర్టిస్ట్ నట కుమారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు పాపులర్ సీరియల్స్ లో నట కుమారి తన నటనతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.
సాధారణంగా నట కుమారి అంటే మంచి నటిగానే కాకుండా మంచి డాన్సర్ గా కూడా ప్రేక్షకులకు పరిచయమే. ఇటీవల నట కుమారి భాగ్యమ్మ అనే మిడిల్ క్లాస్ మదర్ రోల్ పోషించిన దేవత సీరియల్ ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. పక్కా తెలంగాణ యాసలో మాట్లాడుతూ అద్భుతమైన నటనను కనబరిచిందని సీరియల్ లవర్స్ కూడా చెబుతున్నారు.ఇక నట కుమారి తెలుగు సీరియల్స్ తో పాటు అడపాదడపా సినిమాలలో కూడా కనిపించింది. 2006లో గోదావరి సినిమాతో కెరీర్ ప్రారంభించిన నట కుమారి తర్వాత బంధం, గిరిజ కళ్యాణం అనే సీరియల్స్ చేసింది. అయితే.. ఇటీవలే హోమ్ టూర్ వీడియోస్ చేసిన నట కుమారి.. ఎప్పుడు కూడా ఆమె పర్సనల్ డీటెయిల్స్ కెమెరా ముందు షేర్ చేయలేదు.
యాక్టింగ్ విషయం పక్కన పెడితే.. నట కుమారి మల్టీ టాలెంటెడ్ పర్సన్. టీవీ షోలలో ఆమె చేసే డాన్స్ పర్ఫార్మన్స్ చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. సీరియల్స్ తో పాటు ప్రస్తుతం జబర్దస్త్ షో ద్వారా అలరిస్తుంది. మరి నట కుమారి గురించి మీకు తెలిసిన విషయాలను కామెంట్స్ లో తెలియజేయండి.