టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన సినిమా ‘సర్కారు వారి పాట’. దర్శకుడు పరశురామ్ రూపొందించిన ఈ మాస్ ఎంటర్టైనర్.. మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించారు చిత్రయూనిట్. అయితే.. ఈ సినిమాలో పాటలకు పాపులర్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశాడు.
ఈ క్రమంలో మహేష్ బాబుకు డాన్స్ కొరియోగ్రాఫ్ చేసిన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు శేఖర్ మాస్టర్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అగ్ర కొరియోగ్రాఫర్ లలో ఒకరిగా కొనసాగుతున్నాడు శేఖర్ మాస్టర్. మాస్, క్లాస్ స్టెప్పులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే స్టెప్స్ చూసి ఈజీగా గుర్తు పట్టేస్తారు. అలా జనాలకు గుర్తుండిపోయే స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు.
ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాలోని కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్స్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. మహేష్ బాబు చేత శేఖర్ మాస్టర్ వేయించిన స్టైలిష్ స్టెప్పులకు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి సర్కారు వారి పాట మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.