పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – పాన్ ఇండియా రేంజి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’. ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందులోనూ ఓవైపు ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరో, మరోవైపు కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్.. ఒక్క సినిమాకే హీరోయిజం ఎలివేషన్స్ లో మాస్టర్ అనిపించుకున్నాడు. ఇంకేముంది.. సలార్ పోస్టర్ వచ్చింది.. ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ప్రభాస్ ని తారాస్థాయిలో ఊహించుకున్నారు.
యష్ లాంటి కన్నడ స్టార్ ని ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ని చేశాడు. మరి ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ ని ఏ స్థాయిలో చూపిస్తాడో.. అనేది ఊహించుకోవడానికి కూడా ప్రభాస్ కటౌట్ అందట్లేదు. అదీగాక సలార్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ మోస్ట్ వయిలెంట్ గా ఉండబోతుందని తెలిసేసరికి.. ఫ్యాన్స్ లో పూనకాలు మొదలైపోయాయి. సలార్ సినిమాకి ముందే ప్రభాస్.. ఓం రౌత్ డైరెక్షన్ లో ‘ఆదిపురుష్’ ప్రకటించి సర్ప్రైజ్ చేశాడు. కానీ సలార్ సినిమా అనౌన్స్ మెంట్.. ఆదిపురుష్ క్రేజ్ ని కూడా బీట్ చేసేసింది.ప్రశాంత్ నీల్ – ప్రభాస్.. ఈ కాంబినేషన్ లో వస్తున్న ఊరమాస్ సినిమా సలార్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. అందుకే ప్రభాస్ నుండి ఎన్ని సినిమాలు అనౌన్స్ అయినా, వేరే సినిమాల నుండి ఎన్ని అప్ డేట్స్ వచ్చినా.. సలార్ కోసమే వెయిట్ చేస్తుండటం విశేషం. ఇటీవలే కేజీఎఫ్-2 తో బ్లాక్ బస్టర్ రికార్డులు క్రియేట్ చేశాడు ప్రశాంత్. మరి సలార్ తో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూద్దాం.. అనేలోపు తాజాగా ట్విట్టర్ లో సలార్ అకౌంట్ ట్రెండ్ సెట్ చేసింది.
సలార్ అధికారిక ట్విట్టర్ ఖాతా వేరిఫై అయిన ఒక్కరోజులోనే 50 వేలకు పైగా ఫాలోయర్స్ రావడం హాట్ టాపిక్ గా మారింది. సలార్ పై ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ ఫాలోయింగ్ బట్టి అర్థం చేసుకోవాలని అంటున్నాయి సినీవర్గాలు. ఎందుకంటే.. ఈ మధ్యకాలంలో ఈ స్థాయి ఫాలోయింగ్ ఏ సినిమాకు దక్కలేదు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమాను కేజీఎఫ్ ఫేమ్ విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి సలార్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
— Salaar (@SalaarTheSaga) May 17, 2022