Sai Pallavi: ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ‘సాయి పల్లవి’ హవా నడుస్తోంది. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు కూడా ఆమె నటనకు క్లీన్ బౌల్డ్ అయిపోయారు. సుకుమార్ ఏకంగా ఆమెకు లేడీ పవన్ కల్యాణ్ అని బిరుదుగా కూడా ఇచ్చేశారు. ఇక అప్పటినుంచి అభిమానులు ఆమెను లేడీ పవర్ స్టార్ అని పిలవటం మొదలుపెట్టారు. ఆ పేరుకు తగ్గట్టుగా సాయి పల్లవి తన నటన, యాటీట్యూడ్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వెండి తెరపై సాయి పల్లవికి ఎంత క్రేజ్ ఉందో.. బుల్లి తెరపై సుధీర్‌కు కూడా అంతే క్రేజ్ ఉంది. సుధీర్‌కు బుల్లితెర మెగాస్టార్ అన్న టైటిల్ కూడా వచ్చేసింది. సుధీర్ షోలో ఉన్నాడంటే ఆ షో హిట్ అయిపోయినట్లే. కేవలం సుధీర్‌ను స్క్రీన్‌పై చూడటానికి షోలను ఫాలో అయ్యేవారు కూడా ఉన్నారంటే అతిశయోక్తికాదు. ఇక వెండి తెర లేడీ పవర్ స్టార్, బుల్లి తెర మెగాస్టార్లు ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుంది?.. సందడి మామూలుగా ఉండదు కదూ.. సాయి పల్లవి, సుధీర్‌లు ఓకే షోలో కనిపించిటమే కాదు. నవ్వులు కూడా పూయించారు. ఆ షోలో సాయి పల్లవి సుధీర్‌పై పంచ్ కూడా వేశారు. తాజాగా, ఓ ప్రముఖ ఛానల్లో ఫాదర్స్ డే, మ్యూజిక్ డే స్పెషల్ గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు రానా, సాయి పల్లవి జంటగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరినీ సుధీర్, శ్రీముఖి కొన్ని ప్రశ్నలు వేశారు.ముందుగా శ్రీముఖి, సాయి పల్లవిని ఓ ప్రశ్న వేసింది. ‘‘ వేస్ట్ ఫెలో’’ను తెలంగాణ భాషలో ఏమంటారు?’’ అని సుధీర్‌ను చూపిస్తూ అడిగింది. అప్పుడు సాయి పల్లవి ‘‘ హౌలేగా! అంటా’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది. అప్పుడు సుధీర్ ఓ వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ వెంటనే ‘‘మీ నోట్లో నుంచి హౌలే అన్నా సరే! హల్వాలా వస్తోంది’’ అని అన్నాడు. దీంతో అక్కడున్న వారందరూ నవ్వటం ఆరంభించారు. ఇంకా, ఈ షోలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ఆగాల్సిందే. మరి, సుధీర్‌పై సాయి పల్లవి పంచ్ వేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Pranitha Subhash: సాయి పల్లవికి గట్టి కౌంటర్ ఇచ్చిన ప్రణీత సుభాష్