తెలుగు ప్రేక్షకులను డెబ్యూ మూవీతోనే ‘ఫిదా’ చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. మొదటి సినిమా అయినప్పటికీ ఆకట్టుకునే అందం, అభినయంతో కుర్రకారును తనవైపు తిప్పుకుంది. ఇండస్ట్రీలో అందరి హీరోయిన్స్ కంటే భిన్నంగా .. సాయిపల్లవి తనదైన శైలిలో ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుంది. మాములుగా సినిమా హీరోయిన్స్.. ఒక్క హిట్ పడితేనే చాలు వరుసగా సినిమాలను లైనప్ చేసేసుకుంటారు.
మంచి ఫామ్ లో ఉన్నప్పుడే ఏడాదికి అయిదారు సినిమాలకు సైన్ చేసే సందర్భాలు చూస్తుంటాం. కోట్లల్లో రెమ్యూనరేషన్ వస్తుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు. కానీ సినిమాల విషయంలో సాయిపల్లవి స్లో అండ్ స్టడీ పద్ధతినే ఫాలో అవుతోంది. నిజానికి సాయిపల్లవి ఓకే అంటే.. చాలా సినిమాలు తన ముందు క్యూ కడతాయి. కానీ ఆమె ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ నేచురల్ బ్యూటీ.. తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. మరోవైపు సాయిపల్లవి ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసిన విరాటపర్వం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవలే విరాటపర్వం సినిమాకి తనవంతు డబ్బింగ్ పార్ట్ మిగిలి ఉందని చెప్పేసింది.సాయిపల్లవికి టాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నప్పటికీ.. ఇప్పటికి తాను ఓకే చేయలేదని టాక్. అలాగే బాలీవుడ్ లో కూడా అదే స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని.. కానీ తానే ఓకే చేయలేదని స్వయంగా ఒప్పుకుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయ్యాకే తదుపరి సినిమాలు కమిట్ అవుతానంటోంది ఈ వయ్యారి. సాయిపల్లవి ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరిస్ లు ప్లాన్ చేసుకుంటోంది. వెబ్ సిరీస్ లలో కూడా సాయిపల్లవి తన విశ్వరూపం చూపిస్తోంది. ఇటీవలే ‘పావ కథైగల్’ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ నిర్మించబోయే మరో రెండు వెబ్ సిరీస్ లకు ఓకే చెప్పిన్నట్లు సమాచారం. మరి ఈ ఫిదా బ్యూటీ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.