‘మెగా’ మేనల్లుడు.., హీరో.. సాయిధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అవ్వడం, ఆ ప్రమాదంలో తేజ్ కి తీవ్ర గాయాలు కావడం అందరికీ తెలిసిన విషయమే. అయితే.. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం జరిగిన తరువాత ఏమైంది? సాయి తేజ్ కి ఎలాంటి గాయాలు అయ్యాయి? ఇప్పుడు అతను ఆరోగ్యం ఎలా ఉంది? ఇలాంటి విషయాలన్నీ తెలియక.. ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అందుకే.. అసలు ఈ యాక్సిడెంట్ పై కంప్లీట్ రిపోర్ట్ ని ఒక్కసారి తెలుసుకుందాం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కి కాల్ చేశారు.
ఇక తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉదయం 07:16 నిమిషాలకి అపోలో వైద్యులతో సాయిధరమ్ తేజ ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. గణనాధుడి ఆశీస్సులతో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మధ్యాహ్నం 1 గంట సమయంలో.. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో GHMC పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్ పై ఉన్న ఇసుకను తొలగించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఈ కేసు నమోదు చేశారు.