బిగ్ బాస్.. ఇటీవల తెలుగులో బాగా పాపులర్ అయిన రియాలిటీ షో. అందులో అసలు ఏముంటుంది.. జనాలకు పనికొచ్చే సందేశం ఏదైనా ఇస్తారా..? అనే ప్రశ్నలు తలెత్తితే వెంటనే ఆపేసేయండి. ఎందుకంటే.. బిగ్ బాస్ అనేది జస్ట్ టైంపాస్ షో. కొందమంది ఫేమ్ ఉన్న వారిని తీసుకెళ్లి.. బిగ్ బాస్ అనే హౌస్ లో వారిని జడ్జి చేయడమే.. ఈ షో యొక్క ప్రధాన నేపథ్యం. అందులోను టాస్కులు.. పెర్ఫార్మన్స్ బాలేదని వారానికి ఒకరిని బయటికి పంపించేయడమే అంటున్నారు నెటిజన్లు. మరి అలాంటి కామెంట్స్ వినిపించినప్పుడు బిగ్ బాస్ 5 సీజన్లను ఎలా ఆదరించారు? అని డౌట్ రావచ్చు. నిజానికి తెలుగు ప్రేక్షకులలో ఒక వర్గం వారే ఈ బిగ్ బాస్ షోని రోజు చూస్తుంటారు. ఇప్పటివరకు బిగ్ బాస్ 5 సీజన్స్ విజయవంతంగా ముగించుకుంది. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. సెకండ్ సీజన్ నాని.. 3, 4, 5 సీజన్లకు అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేశారు. ఇటీవలే సీజన్ 5 గ్రాండ్ గా ముగిసింది.
అయితే.. సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ లోనే నాగార్జున.. 6వ సీజన్ రెండు నెలల్లోనే ప్రారంభం కానుందని హింట్ ఇచ్చారు. ప్రస్తుతం 6వ సీజన్ కి సంబంధించి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. 6వ సీజన్ ఓటీటీలో రాబోతుందని.. అందులో మంచి ప్రదర్శన కనబరిచిన వారిని ఎంపిక చేసి.. బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభిస్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అది నిజమో కాదో తెలియదు కానీ.. రాబోయేది సీజన్ 6 యేనా లేక OTTలో.. ఫస్ట్ సీజన్ గా ప్రారంభం కాబోతుందా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6 హోస్ట్ ఎవరు? అనేది సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. సీజన్ 3, 4, 5లను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. మరి సీజన్ 6 ప్రస్తావన వచ్చేసరికి అనూహ్యంగా నందమూరి బాలకృష్ణ పేరు వెలుగులోకి వచ్చింది. ఈసారి నాగార్జున కొంతంమంది కంటెస్టెంట్లను టార్గెట్ చేసి.. మరికొంత మంది పై ఫేవరిజమ్ చూపించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బిగ్ బాస్ షోకి కరెక్ట్ మొగుడు బాలయ్యే అంటున్నారు నెటిజన్లు.బాలయ్య హోస్ట్ ఏంటి? అన్నవాళ్ళకి ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోతో ధీటైన జవాబిచ్చాడు బాలయ్య. ‘ఆహా’లో ప్రసారం అవుతున్న ఈ టాక్‌లో బాలయ్య హోస్టింగ్ ని ప్రశంసిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో.. కంటెస్టెంట్స్ తిక్క వేషాలు వేస్తే బాలయ్యలో ఉన్న రెండో మనిషి బయటకు వచ్చేస్తాడు. బాలయ్య ఎంటరైతే సీన్ వేరే లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీజన్ 6 వేరే హీరో హోస్ట్ చేస్తాడని టాక్ నడుస్తుంది. ఒకవేళ నాగ్ తప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా హోస్ట్ గా తన ఓటమిని అంగీకరించినట్లే అవుతుంది. కాబట్టి నాగ్ ఆ ఛాన్స్ ఇవ్వడని అంటున్నారు. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో! మరి బిగ్ బాస్ లోకి బాలయ్య హోస్ట్ గా రావాలనే టీపోయ్క్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.