ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా సందడే కనిపిస్తోంది. అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ పై ప్రపంచవ్యాప్తంగా అభిమానులలో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. మార్చి 25న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే.. తాజాగా ట్రిపుల్ ఆర్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఈ సినిమాకు దాదాపు 490 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
ఇండియన్ సినీ చరిత్రలోనే ఇది ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేయడం విశేషం. తెలుగు సినిమాలే ఈ మధ్యకాలంలో ఇండియన్ సినిమా స్థాయిని పెంచుతున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ.. కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులు సృష్టించనుందని ర్థమవుతుంది. ఇప్పటికే రికార్డు బ్రేకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకుంది. అయితే.. RRR కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలవారి బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ ఇలా ఉన్నట్లు సమాచారం. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం!
నైజాం – 70 కోట్లు
సీడెడ్ – 45 కోట్లు
ఉత్తరాంధ్ర – 26 కోట్లు
గుంటూరు – 18 కోట్లు
ఈస్ట్ – 17 కోట్లు
వెస్ట్ – 14 కోట్లు
కృష్ణ – 14 కోట్లు
నెల్లూరు – 9 కోట్లు
ఏపీ, తెలంగాణ మొత్తం – 213 కోట్లు (అంచనా)
కర్ణాటక – 50 కోట్లు
తమిళనాడు – 45 కోట్లు
కేరళ – 10 కోట్లు
నార్త్ – 100 కోట్లు
ఓవర్సీస్ – 70 కోట్లు
వరల్డ్ వైడ్ – 488 కోట్లు (అంచనా)
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా.. అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని లాంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. మరి RRR సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.