మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం RRR. ప్రపంచ వ్యాప్తంగా ఈ మధ్యకాలంలోనే విడుదలైన ఈ మూవీ సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఇక కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటికి రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి.
ఇక నటన పరంగానూ ఇటు రామ్ చరణ్, అటు యన్టీఆర్ ఎవరూ తక్కువ కాకుండా పోటిపడి నటించారని ప్రముఖ సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇక ఈ మూవీలోని కొమరం భీముడో అంటూ సాగే పాటలో జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన నటనకుగాను నేషనల్ అవార్డు కూడా వరిస్తుందని పలువురు అశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Uppal Balu, Swathi Naidu: ఉప్పల్ బాలు , స్వాతి నాయుడుపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇక వీరి ఎదురు చూపులను నిజం చేస్తూ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 తాజాగా ఓ ప్రకటనను చేసింది. మే 20 నుంచి RRR మూవీ ఓటీటీలో ప్రసారం కానునున్నట్లుగా జీ 5 తాజాగా తెలిపింది. ఈ వార్త తెలియగానే థియేటర్లలో RRR సినిమా చూడని అభిమనులు ఎగిరి గంతేస్తున్నారు. కాగా RRR మూవీ ఓటీటీలో హిందీలో తప్పా.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనే విడుదలవుతుండడం విశేషం. RRR ఓటీటీ డేట్ ఫిక్స్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
#RRR premiering on Zee5, May 20th! pic.twitter.com/sbR25Qtblf
— LetsOTT Global (@LetsOTT) May 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.