దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘RRR‘. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రాధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీ.. ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. బాహుబలి 2తో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్, కలెక్షన్స్ మరో స్థాయికి తీసుకెళ్లి.. కొత్త రికార్డులు సెట్ చేశాడు రాజమౌళి. తాజాగా RRRతో ఆ రికార్డులన్నింటిని తిరగరాస్తున్నాడు. సౌత్, నార్త్, వరల్డ్‌వైడ్‌గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది RRR మూవీ. ఇక వరుసగా ఐదో రోజు కూడా భారీ వసూళ్లూ రాబట్టింది RRR చిత్రం.
ఇది కూడా చదవండి: RRR కథ మొదలయ్యేది ‘మల్లి’ పాత్రతో.. మరి తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా!
ఐదో రోజు ఏపీ, తెలంగాణలో RRR కలెక్షన్లు ఇలా ఉన్నాయి..
నైజాం – 6.70 కోట్ల రూపాయలు
గుంటూరు – 65 లక్షల రూపాయలు
క్రిష్ణ – 70 లక్షల రూపాయలు
ఉత్తరాంధ్ర – 1.51 కోట్ల రూపాయలు
సీడెడ్ – 2.36 కోట్ల రూపాయలు
ఈస్ట్ – 73.5 లక్షల రూపాయలు
వెస్ట్ – 52 లక్షల రూపాయలు
నెల్లూరు – 45 లక్షల రూపాయలు
ఐదో రోజు ఏపీ, తెలంగాణ టోటల్ షేర్– 13.93 కోట్ల రూపాయలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత ఐదు రోజులకు కలిపి RRR మొత్తం కలెక్షన్లు ఇలా ఉన్నాయి…
నైజాం: 68.30 కోట్ల రూపాయలు
సీడెడ్: 34.29 కోట్ల రూపాయలు
ఉత్తరాంధ్ర: 18.78 కోట్ల రూపాయలు
వెస్ట్: 9.18 కోట్ల రూపాయలు
ఈస్ట్: 10.43 కోట్ల రూపాయలు
గుంటూరు: 13.07 కోట్ల రూపాయలు
నెల్లూరు: 5.87 కోట్ల రూపాయలు
క్రిష్ణ: 9.94 కోట్ల రూపాయలు
ఐదు రోజులకు కలిపి ఏపీ, తెలంగాణ టోటల్ షేర్: 169.86 కోట్ల రూపాయలుగా ఉంది.
సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 630 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న RRR సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.