పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చిత్రం రొమాంటిక్. యువ దర్శకుడు అనిల్ పాదూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా పూరి, చార్మి ఇద్దరు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా దీపావళి కానుకగా థియేటర్ లోకి రానుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. అయితే ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ లో భాగంగా చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు.
తాజాగా పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రొమాంటిక్ మూవీ టీమ్ ఫన్నీ చిట్ చాట్ లో పాల్గొంది. ఇక విషయం ఏంటంటే..? ప్రభాస్ ఈ సినిమా హీరోయిన్ కేతిక శర్మ, ఆకాష్ పూరితో ఫన్నీ కామెంట్స్ చేశారు. ముందుగా ఆకాష్ కేతిక శర్మ సాంగ్స్ బాగా పాడుతుంది డార్లింగ్ అని ప్రభాస్ కు చెప్పగానే.. అవునా ఒక సాంగ్ పాడు అని ప్రభాస్ అడుగుతాడు. దీంతో సిగ్గుతో నేను బాత్ రూమ్ సింగర్ సార్.. అంటూ సమాధానమిచ్చింది. దీంతో వెంటనే స్పందించిన ఆకాష్ అయితే ఇదే బాత్ రూమ్ అనుకో.. ఇక్కడ ఎవ్వరం లేము. నేను, ప్రభాస్ డార్లింగ్ లేము అనుకుని పాడెయ్ అని ఆకాష్ చెప్తాడు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన ప్రభాస్ అయినా ఆ పిల్ల బాత్ రూమ్ లో నేను ఎందుకు ఉంటాను రా అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. తాజాగా ప్రభాస్ చేసిన ఈ ఫన్నీ కామెంట్స్ నెట్టింట్లో కాస్త వైరల్ గా మారాయి.