వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. కొద్దిరోజులుగా ఏపీలో సినిమా టికెట్స్ రేట్ల పై జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇదివరకు వైసీపీకి సానుకూలంగా ఉంటూ వేరే నాయకులపై సెటైర్లు వేసే వర్మ.. టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ.. ‘ఒక్క సినిమాల పైనే ఈ ఫిక్స్డ్ రేట్లు ఎందుకు? అసలు గవర్నమెంట్ ఎందుకు జోక్యం చేసుకుంటుంది? ప్రభుత్వం ఏమైనా సినిమాలకు డబ్బులు పెడుతుందా? లేదంటే థియేటర్లు నిర్మించేందుకు లోన్లు ఇచ్చిందా? ఆ టెక్నికల్ ఇష్యూ నాకు తెలియదు. కానీ.. ఇవేవీ లేనప్పుడు ప్రైవేటు ప్రాపర్టీ పై ప్రభుత్వానికి రైట్ ఎలా ఉంటుంది?” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా మంత్రి పేర్ని నానికి సవాల్ విసిరాడు వర్మ. “నిర్మాత ఎంతో కష్టపడి ఓ సినిమా తీస్తే.. దానికి ప్రభుత్వం ఎలా రేటు ఫిక్స్ చేస్తుంది. పేదలు ఉన్నారనే రాష్ట్రంలో రేషన్, పంచదార, కిరోసిన్ తక్కువ ధరకు ఇస్తుంది. కానీ ఆ సూత్రాన్ని సినిమా టికెట్లకు అమలు చేయడం ఎంత వరకు కరెక్ట్ సారూ. సినిమా టికెట్ల ధరలలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తప్పు. ఆడమ్ స్మిత్ ఆర్థిక సూత్రాల ప్రకారం.. ప్రైవేట్ సంస్థల ఉత్పత్తులపై ధరలు నిర్ణయించే హక్కు ఏ ప్రభుత్వాలకు లేవు. సినిమా టికెట్ల విషయంలోనూ ఇంతే. బియ్యం, పంచదార మొదలైన వాటిని పేదలకు అందించడానికి రేషన్ షాపులు సృష్టించబడ్డాయి. మరి మీరు రేషన్ థియేటర్లను సృష్టించడం గురించి ఆలోచిస్తారా సార్?” అంటూ సవాల్ చేశాడు వర్మ. ప్రస్తుతం వర్మ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Dear honourable minister of cinematography @perni_nani Sir, like RATION SHOPS were created to give rice , sugar etc to benefit the poor , would u consider creating RATION THEATRES sir?
— Ram Gopal Varma (@RGVzoomin) January 4, 2022