టాలీవుడ్ సీనియర్ హీరో, రెబల్ స్టార్ కృష్ణంరాజు స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఆయన ఇటీవల ఇంట్లో కాలు జారి కిందపడిపోయారు. అందుకు సంబంధించి చిన్న ఆపరేషన్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఆ విషయం తెలిస్తే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కంగారు పడతారనే కారణంతో బయటకు చెప్పలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు.. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెబుతున్నారు.
రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో అందుకే పాల్గొనలేకపోయారని కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అభిమానులను ఇబ్బంది పెట్టకూడదనే కారణంతోనే ఆ విషయాన్ని బయట పెట్టలేదన్నారు. సినిమా విడుదల తర్వాత కృష్ణంరాజు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రాధేశ్యామ్ మార్చి 11న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులకు ముందుకు రానున్న విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత రాధేశ్యామ్ లో విక్రమాధిత్య గురువు పరమహంసగా కృష్ణంరాజు కనిపించనున్నారు.