యాంకర్ రష్మీ.. బుల్లితెర, వెండితెర రెండింటిలో తానేంటో నిరూపించుకుంది. చూపుతిప్పుకోలేని అందం, అభినయం ఆమె సొంతం. ఒక హీరోయిన్ కు ఉన్నంత ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత కామెండీ షో జడ్జ్ గా మంచి గుర్తింపుతో పాటు మంచి కెరీర్ ను కూడా బిల్డ్ చేసుకుంది. లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి నిలబడితే సక్సెస్ కావడం తధ్యమని రష్మీ కెరీర్ చూస్తే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ఆమె కోసం పెద్ద పెద్ద అభిమాన సంఘాలే ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. కామెడీ షో, స్పెషల్ ఈవెంట్లతో అలరిస్తోంది.
ఇంక సోషల్ మీడియాలో విషయానికి వస్తే ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన డైలీ యాక్టివిటీస్ ను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి. చీరకట్టులో పదహారణాల తెలుగమ్మాయిలా రష్మీ గౌతమ్ కనిపించింది. చీరలో ఉన్న రష్మీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అచ్చు తెలుగమ్మాయిలా చూడచక్కగా ఉన్నావ్ అంటూ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: శేఖర్ సినిమాపై కుట్ర చేస్తున్నారు, థియేటర్లలోంచి తీసేయిస్తున్నారు : రాజశేఖర్
ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం: ప్రముఖ సింగర్ కన్నుమూత